Corona Cases Telangana : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్..24 గంటల్లోనే 10వేలకు పైగా కేసులు
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 10వేల 122 కేసులు నమోదయ్యాయి.

Corona Cases Telangana
corona cases in Telangana : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 10వేల 122 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. 24 గంటల్లోనే 52 మంది కరోనాకు బలైపోయారు.
సోమవారం 6వేల446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 2వేల94 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69వేల221 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నిన్న 99వేల 638 మందికి కరోనా పరీక్షలు చేశారు.
కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,440మంది కరోనా బారిన పడ్డారు. ఇక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 751, రంగారెడ్డిలో 621, వరంగల్ అర్బన్‌లో 653, నిజామాబాద్‌లో 498, నల్లగొండలో 469, ఖమ్మంలో 424, మహబూబ్‌నగర్‌లో 417, కరీంనగర్ జిల్లాలో 369 చొప్పున నమోదయ్యాయి.