Degree : అంచనాలు తారుమారు.. మిగిలిన సీట్లు 2 లక్షల పైనే!

డిగ్రీ సెమిస్టర్ విధానం తీసుకురావడంతో చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ పై మక్కువ చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Degree : అంచనాలు తారుమారు.. మిగిలిన సీట్లు 2 లక్షల పైనే!

Degree

Updated On : October 7, 2021 / 8:47 PM IST

Degree : రాను రాను విద్యార్థులకు డిగ్రీపై ఆసక్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. డిగ్రీ సెమిస్టర్ విధానం తీసుకురావడంతో చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ పై మక్కువ చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీల్లో సెమిస్టర్ విధానమే కావడంతో ఎక్కువ మంది ఇంజినీరింగ్ వైపు చూస్తున్నారు. ఇక వైద్య విద్యకు కూడా డిమాండ్ అమాంతం పెరిగింది. ఎక్కువశాతం విద్యార్థినిలు వైద్య విద్యపై మక్కువ చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిగ్రీలో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి.

Read More : త్వరలో అమెరికా – చైనా మధ్య యుద్ధం జరగొచ్చు

తెలంగాణలో డిగ్రీలో చేరేందుకు మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తైంది.. అయినా 50 శాతం సీట్లు కూడా ఫిల్ కాలేదు.. తెలంగాణలో దోస్త్ పరిధిలో మొత్తం 947 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 4,16,575 సీట్లు ఉండగా ఇప్పటివరకు 1,96,691 మంది విద్యార్థులు కంఫర్మ్ చేసుకున్నారు. దీంతో, సుమారు రెండు లక్షల 20 వేల సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. ఇంటర్‌లో అందరిని పాస్ చేసిన నేపథ్యంలో డిగ్రీలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని అనుకున్న ఆ స్థాయిలో విద్యార్థుల నుంచి స్పందన కరువైంది.. కానీ, గత ఏడాదితో పోలిస్తే అడ్మిషన్స్ సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు చెబుతున్నారు.

Read More :  రూ.40 వేల కోట్ల జీఎస్టీ ప‌రిహారం రిలీజ్‌!