Hyderabad : కలచివేస్తున్న బండ్లగూడ కారు ప్రమాద ఘటన.. తల్లీ కూతుళ్లను మృత్యుదరికి చేర్చిన మార్నింగ్ వాక్

హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద జరిగిన కారు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన తల్లీ కూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొందరి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో మార్నింగ్ వాకర్స్ ఆందోళన చెందుతున్నారు.

Hyderabad : కలచివేస్తున్న బండ్లగూడ కారు ప్రమాద ఘటన.. తల్లీ కూతుళ్లను మృత్యుదరికి చేర్చిన మార్నింగ్ వాక్

Hyderabad

Hyderabad : ఉదయాన్నే మరణం పలకరిస్తుందని ఆ తల్లీ కూతుళ్లు ఊహించలేదు. మరణం కారు రూపంలో కాపు కాసి ఉందని అసలు అనుకుని ఉండరు. ఇంట్లోంచి బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే మృత్యువు ఒడికి చేరారు. శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ రెండు నిండు జీవితాల్ని బలిగొంది. హైదరాబాద్ బండ్లగూడలో కారు సృష్టించిన బీభత్సంలో తల్లీకూతుళ్లు మరణించడం అందరి మనసుల్ని కలచివేసింది.

Shocking Video : వాకింగ్‌కు వెళ్తున్నారా? అయితే బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

ఆరోగ్యం కోసం, ఫిట్ నెస్ కోసం ఇటీవల మార్నింగ్ వాక్ చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మార్నింగ్ వాక్ చేసే మహిళల సంఖ్య పెరిగింది. కొందరు పార్కుల్లో.. ఇంటి చుట్టుపక్కల వాకింగ్ చేస్తారు. కొందరు రద్దీ లేని మెయిన్ రోడ్లపై ఫుట్‌పాత్‌ల వెంబడి వాక్ చేసే వారున్నారు. ఎప్పటిలాగే ఇద్దరు తల్లీకూతుర్లు మార్నింగ్ వాక్ కోసం ఇంట్లోంచి బయలుదేరారు. రోడ్డుపైకి వెళ్లిన కొన్ని క్షణాల్లో రెప్పపాటులో వారిపై నుంచి ఓ కారు దూసుకుపోయింది. కళ్లముందే విగతజీవులైన వారిని చూసి తోటి వాకర్స్ షాకయ్యారు. హైదరాబాద్ శివారులోని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తునాతునకలైన కారుని చూస్తే అతను ఎంతవేగంగా వారిని ఢీకొట్టాడో అర్ధం అవుతుంది.

అనురాధ, మమత.. అనురాధ కూతురు కవిత ఉదయాన్నే వాకింగ్ కి బయలుదేరారు. కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తున్న వీరిపై నుంచి అకస్మాత్తుగా ఓ కారు దూసుకువెళ్లింది. కారుతో పాటు ముగ్గురు చెట్లపొదల్లోకి ఎగిరి పడ్డారు. అనురాధ, మమత అక్కడికక్కడే చనిపోయారు. అనురాధ కుమార్తె కవిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినపుడు కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారణం అయిన బాబుద్దీన్ కాద్రికి లైసెన్స్ కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది.

Car Accident : రంగారెడ్డి జిల్లాలో విషాదం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

మరోవైపు బండ్లగూడ కారు ప్రమాదంలో మరో ట్విస్ట్ బయటపడింది. ప్రమాదానికి కారణమైన కారును ఆన్ లైన్‌లో మహమ్మద్ ఇయాజ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు తెలుస్తోంది. ఓఎల్‌ఎక్స్ డీలర్ నుంచి ఆ కారును బాబుద్దిన్ కాద్రి అనే వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. అయితే ఇప్పటి వరకూ ఆ కారు అడ్రస్ మార్పు చేయలేదు. మొదటగా కారును విక్రయించిన ఇయాజ్ మహమ్మద్‌ను సైతం పోలీసులు విచారిస్తున్నారు.