Anil Kumar Yadav : పుష్ప 2 సినిమాలో ఆ సీన్‌ దారుణం.. సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకున్నారు?- అల్లు అర్జున్ పై ఎంపీ అనిల్ ఫైర్

పుష్ప 2 సినిమా గురించి సినిమా వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది స్మగ్లింగ్ తప్ప.

Anil Kumar Yadav : పుష్ప 2 సినిమాలో ఆ సీన్‌ దారుణం.. సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకున్నారు?- అల్లు అర్జున్ పై ఎంపీ అనిల్ ఫైర్

Updated On : December 22, 2024 / 9:49 PM IST

Anil Kumar Yadav : సంధ్య థియేటర్ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలు చెప్పారని రాజ్యసభ్య సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. అందులో వ్యక్తిత్వ హననం ఏముందని ఆయన ప్రశ్నించారు. హీరో అల్లు అర్జున్ పై ఆయన మండిపడ్డారు. మానవత్వంతో ఆలోచిస్తే, రేవతి సొంత సోదరి అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఓ యాక్టర్ గా పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. పుష్పలో స్మగ్లింగ్ మాత్రమే ఉందని విమర్శించారాయన. ఓ పోలీసు అధికారి ఉన్న స్విమ్మింగ్ పూల్ లో టాయ్ లెట్ పోయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారని హీరో అల్లు అర్జున్ ని ఎంపీ అనిల్ ప్రశ్నించారు.

‘క్యారెక్టర్ అసాసినేషన్ అని అల్లు అర్జున్ అంటున్నారు. మరి, చనిపోయిన రేవతి గురించి ఎవరూ మాట్లడటం లేదు. రేవతిని ఎవరు బతికిస్తారు, ఆమెను ఎవరు తీసుకొస్తారు? దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నీకేం, మళ్లీ సినిమాలు తీస్తావ్, నీ బిజీలో నువ్వు ఉంటావు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటున్న మీరు.. ఒక యాక్టర్ గా ఈ సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామనుకున్నారు? పుష్ప సినిమా గురించి సినిమా వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది స్మగ్లింగ్ తప్ప. ఏం మేసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు? ఓ పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో ఉంటే హీరో ఇమేజ్ ఉన్న మీరు టాయ్ లెట్ చేయడం ఏంటి? అసలేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని హీరో అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.

 

Also Read : పుష్ప 2 సినిమాపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు