KA Paul : నెక్ట్స్ సీఎం నేనే.. నన్ను ఆపుతావా.. తనిఖీ అధికారిపై రెచ్చిపోయిన కేఏ పాల్
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి చేశారు. తెలంగాణకు తాను కాబోయే సీఎంని అని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులపై మండిపడ్డారు.

KA Paul : మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి చేశారు. తెలంగాణకు తాను కాబోయే సీఎంని అని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులపై మండిపడ్డారు. ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనరే తన ఫాలోవర్ అని, తాను పర్మిషన్ తీసుకునే ప్రచారం చేస్తున్నానంటూ ఫైర్ అయ్యారు. అసలు నువ్వెవరు అంటూ.. తనను అడ్డుకున్న అధికారి ఐడీ కార్డు లాక్కునే ప్రయత్నం చేశారు కేఏ పాల్. దీంతో పక్కనే ఉన్న మరికొంత మంది అధికారులు సర్ది చెప్పడంతో పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మునుగోడు నియోజకవర్గం చండూరులో ఈ ఘటన జరిగింది. కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచారం నిర్వహిస్తుండగా.. వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ వాహనాన్ని ఓ తనిఖీ అధికారి అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ సీరియస్ అయ్యారు. నన్నే ఆపుతారా? మీకా అధికారం ఎవరిచ్చారు? అంటూ ఆ అధికారిపై పాల్ రెచ్చిపోయారు. అంతేకాదు, సదరు అధికారిని.. నీ పేరు ఏంటంటూ అధికారి మెడలోని ఐడీ కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం కూడా చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో కేఏ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొలుత ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉంటారని కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉంటే.. ఎన్నికల సంఘం కేఏ పాల్‌కు ఉంగరం గుర్తు కేటాయించింది. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు తనదే అని విశ్వాసంగా చెబుతున్నారు కేఏ పాల్.