Nagam Janardhan Reddy : కాంగ్రెస్ లో నాకే గ్యారంటీ లేదు.. ఇక పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దేవుడెరుగు : నాగం జనార్ధన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకుండా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తన మనోభావాలు దెబ్బతిస్తున్నారని పేర్కొన్నారు.

Nagam Janardhan Reddy : కాంగ్రెస్ లో నాకే గ్యారంటీ లేదు.. ఇక పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దేవుడెరుగు : నాగం జనార్ధన్ రెడ్డి

Nagam Janardhan Reddy (1)

Updated On : October 25, 2023 / 6:59 PM IST

Nagam Janardhan Reddy – Revanth Reddy : కాంగ్రెస్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నాగం జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాకే గ్యారంటీ లేదన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దేవుడెరుగు మొదట నాకు గ్యారంటీ ఇవ్వండి’ అని అన్నారు. ఐదు సార్లు విజయం సాధించిన తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకుండా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తన మనోభావాలు దెబ్బతిస్తున్నారని పేర్కొన్నారు. 1989లో ఎన్టీఆర్ టికెట్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. పార్టీలో కష్టపడే వారికి టికెట్ ఇవ్వకుండా సభ్యత్వం తీసుకొని ఐదు రోజులు గడవక ముందే ఎలా టికెట్ ఇస్తారని నిలదీశారు.

DG Sanjay Bahadur : ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు.. రూ.53.93 కోట్లు, 156 కేజీల బంగారం, 464 కేజీల వెండి స్వాధీనం : ఐటీ డీజీ సంజయ్ బహదూర్

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి తనకు తెలియకుండా తన ఫొటో పెట్టి ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశానని తెలిపారు. 2018లో తాను కాంగ్రేస్ పార్టీ నుండి పోటీ చేస్తే ప్రస్తుత అభ్యర్థి తనను ఓడించారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ ఎలా టికెట్ ఇస్తుందని ప్రశ్నించారు.

టికెట్ ఇవ్వక పోవడంపై కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీతో సమావేశమయ్యానని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రేస్ టికెట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇప్పటికైనా టికెట్ ఇవ్వకపోతే తప్పనిసరిగా ప్రజల అభిప్రాయం మేరకు ఒకటి రెండు రోజుల్లో ఎదో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.