Nagarjuna Sagar Tourism : లాక్‌డౌన్ ఆంక్షల ఎత్తివేతకోసం.. నాగార్జునసాగర్ పర్యాటక అందాల ఎదురు చూపులు…
నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతం పర్యాటకులు రాక కోసం ఎదురుచూస్తుంది. లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ నాగార్జున కొండ, అనుపు ప్రదేశాలు ఆంక్షల సడలింపుతో టూరిస్టులకు తిరిగి స్వాగతం చెప్పేందుకు సిద్దమౌతున్నాయి.

Nagarjuna Sagar Tourism To Wait For Lockdown Relaxation For Tourists
Nagarjuna Sagar Tourism : నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతం పర్యాటకులు రాక కోసం ఎదురుచూస్తుంది. లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ నాగార్జున కొండ, అనుపు ప్రదేశాలు ఆంక్షల సడలింపుతో టూరిస్టులకు తిరిగి స్వాగతం చెప్పేందుకు సిద్దమౌతున్నాయి. ఏపీ, తెలంగాణ లలో పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ ఎత్తివేస్తే సాగర్ కు పర్యాటకులు తాకిడి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర పురావస్తు శాఖ నాగార్జున కొండ మ్యూజియంకు పర్యాటకులను అనుమతిస్తూ అదేశాలు జారీ చేసిన నేపధ్యంలో పర్యాటకుల సందర్శనకు మార్గం సుగమమైంది.
పురావస్తు శాఖ మ్యూజియంను తిరిగి ఓపెన్ చేసినా నాగార్జున కొండకు చేరేందుకు అవసరమైన లాంఛీ ప్రయాణానికి అనుమతి లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు సాగర్ వద్ద తమతమ భూభాగాల పరిధిలో ఉన్న లాంచ్ స్టేషన్ నుండి లాంచీలను నడిపేందుకు అవసరమైన అదేశాలను ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత మ్యూజియం ఉద్యోగాల కోసం మాత్రమే ఒక లాంచ్ ను నాగార్జున కొండకు నడుపుతున్నారు.
లాక్ డౌన్ ఆంక్షలు క్రమక్రమంగా సడలిస్తుండటంతో ఏక్షణంలోనైనా లాంచీలను నాగార్జున కొండకు నడిపేందుకు టూరిజమ్ అధికారులు అదేశాలు ఇవ్వవచ్చన్న ఆలోనలో స్ధానిక సిబ్బంది ఉన్నారు. పర్యాటక శాఖ నుండి అదేశాలు అందిన మరుక్షణం పర్యాటకులు రాకపోకలు సాగించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లలో లాంచ్ స్టేషను సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.
ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. మరో వైపు ఎండాకాలం కొంత ఆకురాలిపోయి ఉన్న వృక్షాలు ఇప్పుడిప్పుడే చిగుళ్ళు తొడుగుతున్నాయి. ప్రాజెక్టులో నిండికుండా నీరు, చుట్టూ పరుచుకున్న పచ్చదం పర్యాటకులకు మంచి అహ్లాదాన్ని కలిగించే వాతావరణం ప్రస్తుతం నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతంలో కనిపిస్తుంది.
పర్యాటక శాఖ కు నాగార్జున సాగర్ టూరిజం ప్రాంతం మంచి ఆదాయవనరు. ఆంక్షలు సడలించి పర్యాటకులను అనుమతిస్తే తిరిగి సాగర్ పర్యాటకానికి టూరిస్టులు తాకిడి పెరగడంతోపాటు పండుగవాతావరణం నెలకొంటుందని స్థానికులు అంటున్నారు. మరో వైపు ఈ పర్యాటకాన్నే అధారంగా చేసుకుని జీవనోపాధి పొందుతున్న అనేక కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.