ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు

పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని చెప్పారు.

ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు

Naveen Mittal

ధరణి సమస్యలపై కలెక్టర్లతో తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు.

ఈ నెలలోనే వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని అన్నారు. పాస్ బుక్ డేటాలోనే అధికంగా దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలను గుర్తించామని అన్నారు. వాటిలో 163 సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు.

Also Read: పార్టీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా సరే..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వారం-పది రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అన్నారు. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని చెప్పారు. అతి తక్కువ ములుగులో ఉన్నాయని అన్నారు. కాగా, ధరణి సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.