Delhi NCB : ఢిల్లీ డ్రగ్స్ కేసు.. హైదరాబాద్ వైద్యుడు అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో ఈ డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. పట్టుకున్న వారిలో హైదరాబాద్ వైద్యుడు ఉన్నాడని తేలింది. వైద్యుడు పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది.

Ncb
NCB Arrests 22 Persons : అతనో వైద్యుడు. అది కూడా సైక్రియాటిస్టు. మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చికిత్స చేసి..మానసికంగా బాధ పడకుండా కౌన్సెలింగ్ చేసి మంచిగా చేయాల్సిన ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా వారిపైనే డ్రగ్స్ ప్రయోగించాడు. ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అని టెస్టులు కూడా చేస్తున్నాడు. అంతేగాకుండా.. ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నాడు. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వైద్యుడు హైదరాబాద్ కు చెందిన వాసిగా తేలడం సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని పట్టుకున్న వారిలో ఇతను కూడా ఉన్నాడు.
Read More : Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సాంగ్‌ని లీక్ చేసిన వ్యక్తులు అరెస్ట్
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అంశం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో ఈ డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. పట్టుకున్న వారిలో హైదరాబాద్ వైద్యుడు ఉన్నాడని తేలింది. వైద్యుడు పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 22 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సైక్రియాటిస్టు ఆదిత్య రెడ్డి ఉన్నారు. మానసిక రోగులపై డ్రగ్స్ ప్రయోగిస్తున్నట్లు తేల్చారు. ఎల్ఎస్ డి, ఎండిఎంఏలకు ఆదిత్య రెడ్డి బానిసగా మారాడు. ఓన్లీ లవ్ పేరిట డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆదిత్య రెడ్డి ఇంకా ఏమి చేసేవాడో.. మరింత లోతుగా దర్యాప్తు జరుపనున్నారు. హైదరాబాద్ కు చెందిన వైద్యుడు పట్టుబడడంతో కలకలం రేపింది. ఎంతకాలంగా మానిసికంగా ఉన్న రోగులపై డ్రగ్స్ ప్రయోగిస్తున్నాడో దర్యాప్తులో తేలనుంది. వారిపై టెస్టులు కూడా చేసినట్లు నిర్ధారించారు. ఇతను ఒక్కడే చేశాడా ? మరెవరైనా సహాయం చేస్తున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు.