Hyderabad Metro Route Map : హైదరాబాద్‌లో నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ రెడీ.. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం

Hyderabad Metro Route Map : హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) గుర్తించిన ప్రాంతాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ కోసం కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం తీసుకుంది.

Hyderabad Metro Route Map : హైదరాబాద్‌లో నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ రెడీ.. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం

New Route map for Hyderabad Metro Phase 2 expansion finalised

Updated On : January 22, 2024 / 11:25 PM IST

Hyderabad Metro Route Map : హైదరాబాద్ మహానగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ కోసం నూతన మెట్రో రైలు రూట్ మ్యాప్ సిద్ధమైంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు హెచ్ఎమ్ఆర్ఎల్ (HMRL) మెట్రో రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఫేజ్-2లో భాగంగా బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్వే లైనును చాంద్రాయణగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డీపీఆర్ సిద్ధం చేస్తామని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

Read Also : Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పై టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్..

ఫేజ్-2 కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ఈ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. కొత్త మెట్రో కారిడార్‌ల కోసం డీపీఆర్‌ల తయారీ శరవేగంగా జరుగుతోందని, మరో 3 నెలల్లో డీపీఆర్‌లు సిద్ధమవుతాయని ఎండీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నూతన మెట్రో కారిడర్ రూట్లను కూడా వెల్లడించారు.

కొత్త మెట్రో రైలు రూట్ మ్యాప్ ఇదే : ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే? :
ప్రస్తుతం, హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్, ఎల్‌బి నగర్, జెబిఎస్ స్టేషన్ నుంచి ఎంజిబిఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య మూడు కారిడార్‌లలో 69 కి.మీ మేర సర్వీసులను అందిస్తోంది. కొత్త ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలు హైదరాబాద్ నగరంలోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉండేలా నగరంలోని నాలుగు మూలల నుంచి విమానాశ్రయాన్ని కలుపుతాయి.

New Route map for Hyderabad Metro Phase 2 expansion finalised

New Route map for Hyderabad Metro

కారిడార్-2లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. అలాగే, కారిడార్-2లో ఫలక్నామా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు విస్తరించనున్నారు. కారిడార్-4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్, చాంద్రాయణగుట్ట మీదుగా మైలార్దేవరపల్లి పి7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 29 కిలోమీటర్లు మెట్రోను విస్తరించనున్నారు.

కారిడార్-4లో మైలార్ దేవరపల్లి నుంచి వయా ఆరాంఘర్ మీదుగా ప్రపోస్డ్ హైకోర్టు రాజేంద్రనగర్ వరకు 4 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ నానక్రాం గూడ జంక్షన్ విప్రో జంక్షన్, అమెరికన్ కౌన్సిలేట్ వరకు 8 కిలోమీటర్లు, కారిడార్-6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బిహెచ్ఎల్ మీదుగా పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్లు, కారిడార్-7లో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో మెట్రోను నిర్మించనున్నారు.

Read Also : Ayodhya Airport : రామమందిరం ప్రారంభోత్సవం.. 30 గంటలలోపే 39 ప్రైవేటు జెట్స్.. వీఐపీ విమానాలతో అయోధ్య ఎయిర్‌పోర్టు కిటకిట..!