తెలంగాణలో ఫస్ట్ టైమ్ : కరీంనగర్ లో కొత్త ట్రాఫిక్ పోలీసులు.. 24 అవర్స్ డ్యూటీ

కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ వచ్చారు. 24 గంటలూ డ్యూటీలోనే ఉంటున్నారు. అసలు కనురెప్ప కూడా వాల్చడం లేదు. కొత్త ట్రాఫిక్ కాప్స్ ను చూసి వాహనదారులు

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 10:03 AM IST
తెలంగాణలో ఫస్ట్ టైమ్ : కరీంనగర్ లో కొత్త ట్రాఫిక్ పోలీసులు.. 24 అవర్స్ డ్యూటీ

Updated On : January 4, 2020 / 10:03 AM IST

కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ వచ్చారు. 24 గంటలూ డ్యూటీలోనే ఉంటున్నారు. అసలు కనురెప్ప కూడా వాల్చడం లేదు. కొత్త ట్రాఫిక్ కాప్స్ ను చూసి వాహనదారులు

కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ వచ్చారు. 24 గంటలూ డ్యూటీలోనే ఉంటున్నారు. అసలు కనురెప్ప కూడా వాల్చడం లేదు. కొత్త ట్రాఫిక్ కాప్స్ ను చూసి వాహనదారులు భయపడుతున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని వాహనాలు నడుపుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఎక్కడా లిమిట్స్ క్రాస్ చెయ్యడం లేదు. దీంతో అధికారులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. సాధారణంగా కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటేనే వాహనదారులు సిగ్నల్స్‌ను పాటిస్తారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ఎవరి ఇష్టం వారిది. రూల్స్ బ్రేక్ చేస్తారు. ఇష్టమొచ్చినట్టు వాహనాలు నడుపుతారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కొత్త ఐడియా వేశారు.

ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితులోనైనా వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించేలా కరీంనగర్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ను తీసుకొచ్చారు. అయితే.. ఆ కాప్స్ మనుషులు కాదు.. బొమ్మలు. అవును.. చౌరస్తాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ రూపంలో ఉండే బొమ్మలను ఏర్పాటు చేశారు. రియల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరిగా తయారు చేసిన ఈ బొమ్మలను కరీంనగర్‌ టౌన్  మొత్తం పెట్టారు. దాంతో, నిజంగానే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడేమో అనుకుని సిగ్నల్స్ క్రాస్ చేసేందుకు వాహనదారులు భయపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ మందుకెళ్తున్నారు. 

మొత్తం 16 ట్రాఫిక్ కానిస్టేబుల్ బొమ్మలను తెప్పించిన కరీంనగర్ పోలీసులు 11 సర్కిల్స్ లో పెట్టారు. మిగతా 5 బొమ్మలను రూరల్ ప్రాంతాల్లో అమర్చారు. బాగా దగ్గరికి వచ్చి చూస్తే కానీ.. ఇది బొమ్మ అనే విషయం వాహనదారులకు తెలియదు. దాంతో, వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తున్నారు. అయితే, అవి బొమ్మలని తెలిశాక వాహనదారుల్లో భయం పోతుందని ఆలోచించిన పోలీసులు ఆయా ప్రాంతాలకు వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 

దాంతో, ఆయా సర్కిళ్లలో ఉన్నది నిజమైన ట్రాఫిక్ కానిస్టేబులో లేక బొమ్మో తెలియక వాహనదారుల్లో కొంత భయం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నది బొమ్మే అనుకుని రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు సడన్ షాకిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ బొమ్మల ఫార్ములాను కరీంనగర్ పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఇలా కాప్స్ ను వినియోగిస్తున్నారని, అక్కడ ఇది విజయవంతమైందని తెలిపారు. ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని కరీంనగర్ పోలీసులు నమ్మకం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ను నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ విధానం బాగా యూజ్ అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు. వాహనదారులు కూడా బొమ్మ పోలీసులు భలే ఉన్నారని కితాబిస్తున్నారు. ఇది మంచి పని అని, దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Also Read : ఇరాన్‌తో యుద్ధం ముప్పు రాబోతుందా?