Nizamabad Family Suicide : మా చావుకి కారణం ఆ నలుగురు.. నిజామాబాద్ ఫ్యామిలీ కేసులో సూసైడ్ లెటర్ లభ్యం

ఈ కేసులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తమ కుటుంబం చావుకి నలుగురు కారణం అంటూ పప్పుల సురేశ్ లేఖ రాశారు. గణేశ్ కుమార్, వినీత, చంద్రశేఖర్..

Nizamabad Family Suicide : మా చావుకి కారణం ఆ నలుగురు.. నిజామాబాద్ ఫ్యామిలీ కేసులో సూసైడ్ లెటర్ లభ్యం

Nizamabad Family Suicide Letter

Updated On : January 9, 2022 / 9:14 PM IST

Nizamabad Family Suicide : తెలంగాణలోని నిజామాబాద్ వ్యాపారి కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ కేసులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తమ కుటుంబం చావుకి నలుగురు కారణం అంటూ పప్పుల సురేశ్ లేఖ రాశారు. గణేశ్ కుమార్, వినీత, చంద్రశేఖర్, సాయిరాం మనోహర్ పేర్లను సూసైడ్ నోట్ లో రాశారు పప్పుల సురేశ్.

అప్పుల బాధలు.. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఆగడాలు భరించలేక సురేష్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సురేశ్, శ్రీలత దంపతులు తమ ఇద్దరు కుమారులు అఖిల్, ఆశిష్‌తో కలసి నిజామాబాద్‌లోని గంగస్థాన్ ఫేజ్-2లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు.

Visakhapatnam Constable : అదృశ్యమైన క్రైమ్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

సురేష్‌.. నిజామాబాద్‌లో రెండు మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. పెద్ద కొడుకు అఖిల్ కొద్దికాలంగా ఓ పెట్రోల్ బంకు లీజుకు తీసుకున్నారు. చిన్న కొడుకు ఆశిష్ బీ ఫార్మసీ చదువుతున్నాడు. వ్యాపార రీత్యా సురేష్ కుటుంబానికి భారీగా అప్పులు పేరుకుపోయాయి. సుమారు రూ.4 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం.. కొద్దిరోజుల కిందట కొడుకు నడిపిస్తున్న పెట్రోల్ బంకుకి వచ్చి కొందరు బెదిరించి వెళ్లడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం సురేష్ కుటుంబం విజయవాడ వచ్చింది. స్థానిక కన్యకాపరమేశ్వరి సత్రంలో గది అద్దెకు తీసుకుంది. అదే సమయంలో నిజామాబాద్‌లో తాము నివాసముంటున్న ఫ్లాట్‌ని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ జప్తు చేసిందని తెలియడంతో కుటుంబం మానసికంగా కుంగిపోయింది. ఆ అవమానం భరించలేక.. తిరిగి ఇంటికి వెళ్లలేక అఘాయిత్యానికి పాల్పడింది. బంధువులకు మెసేజ్ చేసి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

అప్పులు, అధిక వడ్డీలు సురేశ్ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అంచెలంచెలుగా ఎదిగిన ఆ కుటుంబం అప్పుల కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో రోడ్డున పడింది. ఆస్తులన్నీ అప్పులకే పోగా.. ఇంకా కట్టాల్సిన బకాయిల కోసం అప్పుల వాళ్లు ఎదురు చూస్తుండటంతో సురేశ్ కుటుంబం ఒత్తిడికి లోనైంది. ఓవైపు అప్పులు తీర్చాలన్న ఒత్తిడి తీవ్రం కావడం, మరోవైపు ఇంటిని సీజ్ చేయడంతో అవమానంగా భావించిన సురేశ్ కుటుంబం అర్థాంతరంగా తనువు చాలించింది.

Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్

తమ ఫ్లాట్‌పై సురేశ్‌ సుమారు రూ.30 లక్షల మేర అప్పు చేసినట్లు తెలిసింది. PCHFL అనే ఫైనాన్స్‌ సంస్థ బకాయిల వసూలు కోసం శుక్రవారం సురేశ్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా ఎవరూ లేకపోవడంతో ఫ్లాట్‌ గోడపై ‘ఈ ఆస్తి PCHFL‌’కి చెందినదిగా రాసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారు, ఫైనాన్స్‌ వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. సురేశ్‌ కుటుంబం 15 రోజుల క్రితమే ఊరు వదిలి వచ్చినట్లు తెలిసింది. ఎంతో ఆనందంగా, అందరితో బాగా ఉండే సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర వేదనకు గురి చేసిందని స్థానికులు కంటతడి పెట్టారు.

వ్యాపారి కుటుంబం ఆత్మహత్య కేసులో ఓ రాజకీయ నేత (నిజామాబాద్ కు చెందిన గణేష్ కుమార్) పేరు బయటకు వచ్చింది. అప్పుల కోసం సురేశ్ కుటుంబాన్ని నలుగురు వ్యక్తులు వేధించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ నలుగురి పేర్లను పోలీసులు రికార్డులో నమోదు చేశారు.