Lemon Water : మోతాదుకు మించి నిమ్మరసం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఎముకలకు చాలా హాని కల్గిస్తుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు కూడా ఇది కారణమవుతుంది.నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వలన ఐరన్ శోషణ కూడా పెంచుతుంది.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరసం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

Lemon Water

Lemon Water : నిమ్మకాయలో ఉన్న ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. నిమ్మ తొక్క నుంచి రసం వరకు ప్రతి ఒక్కటీ శరీరానికి మేలు చేసేవే. నిమ్మలో విటమిన్‌ C, విటమిన్‌ B, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వాడుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఉదయం సమయంలో గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తేనె, కలుపుకుని తాగుతుంటారు.

నిమ్మ రసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది. నిమ్మ రసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది. మంచి పోషక పదార్ధాలతోపాటు నిమ్మరసం తీసుకుంటే మహిళల్లో గర్భస్రావాలు ఉండవు. జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది. నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. కాలేయం శుభ్రమవుతుంది. గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కరోనా వైరస్ నేపథ్యంలో నిమ్మను రోజువారీ ఆహారంతో తీసుకునేవారు ఎక్కవమందే ఉన్నారు.. నిమ్మతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోజూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని బావిస్తూ అధిక మోతాదులో తీసుకుంటున్నారు. అయితే నిమ్మ రసాన్ని అధిక మోతాదులో తీసుకోవటం వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయి. నిమ్మరసంను ఎక్కువగా తాగడం వలన గుండెల్లో మంట ఇంకా వికారం వస్తుంది. నిమ్మరసంను రోజూ తాగడం వలన కడుపు నొప్పి కూడా కలుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా ఎక్కువవుతాయి. ఇందులో ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి అనేవి పుష్కలంగా ఉంటాయి. దీంతో తరచూ మూత్రవిసర్జన సమస్యను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చేయడం ద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది.

నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఎముకలకు చాలా హాని కల్గిస్తుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు కూడా ఇది కారణమవుతుంది.నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వలన ఐరన్ శోషణ కూడా పెంచుతుంది. కానీ ఎక్కువ మోతాదులో విటమిన్ సి ఉండడం వలన శరీరంలో ఐరన్ శాతం అనేది కూడా పెరుగుతుంది. నిమ్మరసంలో ఉంటే సిట్రిక్ యాసిడ్ నోటి పూతలను కూడా మరింత తీవ్రం చేస్తుంది. ఇక అలాగే చిగుళ్ల సమస్యలను ఎక్కువగా కల్గిస్తుంది. దానివల్ల ఆ సమయంలో ఆహారం తినడం కూడా పెద్ద ఇబ్బందిగా మారుతుంది.

నిమ్మరసంలో ఆమ్లత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలోని కాల్షియం మొత్తాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఎముక బలహీనంగా మారుతుంది. చివరికి ఇది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు, ఎముకల సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. నిమ్మరసం అధికంగా తాగితే మీరు తరచుగా మైగ్రేన్ సమస్య బారిన పడతారు. కనుక నిమ్మరసం సాధ్యమైనంత తక్కువగా సేవించాలి.

కాబట్టి నిమ్మరసం తాగేవారు రోజుకు రెండు నిమ్మకాయల రసం కంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.