Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్

గుంటూరు జిల్లా మేడికొండూరులో సెప్టెంబర్ 2021లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితులు కర్నూలు జిల్లాకు చెందిన గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు

Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్

Sp

Crime News: గుంటూరు జిల్లా మేడికొండూరులో సెప్టెంబర్ 2021లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితులు కర్నూలు జిల్లాకు చెందిన గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎస్పీ నిందితుల వివరాలు వెల్లడించారు. మేడికొండూరు మండలం పాలడుగు వద్ద మహిళపై సామూహిక అత్యాచారంతో పాటు.. దండుపాళ్యం బ్యాచ్ ని మించి.. ఈముఠా సభ్యులు చేసిన దారుణాలను ఎస్పీ వివరించారు.

Also read: Luxury Naxalites: నక్సల్స్ వద్ద ఆ కార్లను చూసి బిత్తరపోయిన పోలీసులు

మొత్తం ఎనిమిది మంది ఉన్న ఈముఠా సభ్యుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో దాసరి లింగమయ్య, దాసరి ఓబులేసు, దాసరి చిన లింగమయ్య, చెంచుబెత్తల హనుమంతు, దాసరి వెంకన్న, ఇళ్ల రమణయ్య(వెంకటరమణ) మరొక వ్యక్తి ఉన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు రూరల్ పరిధిలోనే వీరు 18 దారి దోపిడీలు, పలు అత్యాచారాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. హై వేపై లారీలను అడ్డుకుని దారి దోపిడీలకు పాల్పడడంతో పాటు, ఒంటరి మహిళలను, జంటలను టార్గెట్ గా చేసుకుని ఈముఠా దారుణాలకు ఒడిగట్టినట్లు ఎస్పీ వివరించారు. కర్నూలు జిల్లాకు చెందిన నిందితులు.. గుంటూరు రూరల్ పరిధిలో మిరప కోతలు, కుప్ప నూర్చుడు వంటి కూలీపనులకు వచ్చేవారు. పగలు పొలాల్లో కూలిపనులు చేసుకుంటు.. రాత్రిళ్ళు ఈదారుణాలకు పాల్పడ్డారు.

Also read: Road Accident: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను బలిగొన్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం

గత ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించిన రూరల్ ఎస్పీ.., డీజీపీ ఆదేశాలతో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం పటిష్ట గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం వెతుకుతున్న పోలీసులకు పలు విస్తుపోయే విషయాలు తెలిసాయి. చేయబోయే పనిగురించి నిందితులు ముందుగానే ఒక నిర్ణయానికి వస్తారని, రెండు మూడు రోజులు ముందుగానే రెక్కి వేస్తారని ఎస్పీ వెల్లడించారు. మెయిన్ రోడ్డు నుండి దూరంగా వుండే కొండ ప్రాంతాలలో నివాసం ఏర్పరుచుకుని.. ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత జాగ్రత్తగా వుంటారు. మొబైల్‌ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను వినియోగించేవారు కాదు. ఎంత దూరమైనా కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారని ఎస్పీ తెలిపారు. పని ఉన్న సమయంలో కర్నూలు నుండి ట్రెయిన్ లో వస్తూపోతూ ఉండే వీరు గుంటూరు రూరల్ పరిధిలో పొలాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. నిందితులు చేసిన అకృత్యాలపై స్పందించిన ఎస్పీ విశాల్ గున్నీ..వీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా పేర్కొన్నారు.

Also read: Google Issue: గూగుల్ పై విచారణకు ఆదేశించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)