MP Arvind : కేసీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ లో పోటీ చేయాలి : ఎంపీ అరవింద్ సవాల్
కేటీఆర్ ఇంటికి వస్తానని 2022-23 బడ్జెట్ పై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. తాను గృహలక్ష్మికి డబ్బులు కేటాయించలేదని నిరూపిస్తానని, విడుదల చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ప్రజలు కేసీఆర్, కేటీఆర్ లను నమ్మడం లేదన్నారు.
Nizamabad MP Arvind : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ లో పోటీ చేయాలని అరవింద్ సవాల్ చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చే లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ ను నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తామన్నారు. కేటీఆర్ ఎలిజిబిలిటీ కేవలం కేసీఆర్ కొడుకు మాత్రమేనని.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే కనీసం కుటుంబంలో గౌరవం కూడా దక్కదని తెలిపారు. కేటీఆర్ నిజామాబాద్ లో మోసపూరిత వాగ్ధానాలు చేశారని విమర్శించారు.
మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కవితకు అప్పచెప్పారని పేర్కొన్నారు. సభకు రాలేదని తనను అడుగుతున్న కేటీఆర్.. కవిత ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేటీఆర్ ముఖం చూడటం ఇష్టం లేకనే కవిత ప్రోగ్రాంకి రాలేదని చెప్పారు. కవిత మఖం చూడలేక ఆమెను ఇందురు ప్రజలు తిప్పి పంపించారు. పార్లమెంటులో విప్ ఉండటం వల్ల నిన్నటి కేటీఆర్ సభకు వెళ్ళలేదన్నారు. నువ్వు ఓపెనింగ్లు చేస్తుంటే నేను చూస్తుండాలా? అని కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు.
Budvel : బుద్వేల్ భూముల వేలంపై స్టే నిరాకరించిన హైకోర్టు
కేసీఆర్, కేటీఆర్ లకు సంస్కారం నేర్పిన వారిలో తాను ఒకడినని పేర్కొన్నారు. గృహలక్ష్మి రూ.5 నుంచి 6 లక్షలు ఇస్తామని, ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారని పేర్కొన్నారు. 70 ఏళ్ల కేసీఆర్ మేనిఫెస్టో లో రూ.5 లక్షలు కుదించి రూ.3 లక్షలు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. గృహలక్ష్మి పథకం కింద రూ.12 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కేటీఆర్ పుట్టుకే దగుల్ బాజీ పుట్టుకని ఘాటుగా విమర్శించారు.
కేటీఆర్ ఇంటికి వస్తానని 2022-23 బడ్జెట్ పై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. తాను గృహలక్ష్మికి డబ్బులు కేటాయించలేదని నిరూపిస్తానని, విడుదల చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ప్రజలు కేసీఆర్, కేటీఆర్ లను నమ్మడం లేదన్నారు. 2014 నుంచి ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చలేదని విమర్శించారు. మద్యం టెండర్ కి 15 రోజుల టైం ఇచ్చారని, గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం 3 రోజుల సమయం ఇస్తారా అని నిలదీశారు.
YS Sharmila: షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు.. విలీనానికి అంతా సిద్ధమా?
నిజామాబాద్ లో 50 వేల రేషన్ కార్డుల అప్లికేషన్లు, తెలంగాణ వ్యాప్తంగా లక్షల్లో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ దగ్గర తాను సంస్కారం నేర్చుకోవాలా అని అన్నారు. రఘునాథ చెరువు చాలా బలహీనంగా ఉందని, ఎదో ఒక రోజు కొట్టుకుపోతుందని చెప్పారు. 25,000 చదరపు అడుగుల ఐటీ హబ్ నిర్మించడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. 280 మందికి ఉద్యోగాలు ఇస్తే వాటిలో కాల్ సెంటర్ ఉద్యోగాలు ఇస్తే అందులో 80 మంది వద్దని వెళ్ళిపోయారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పెట్టిన పార్లమెంట్ సమావేశాలు ఏడాదికి నలుగు నెలలు నడుస్తున్నాయని, కేసీఆర్ లాగా నాలుగు రోజులు నడిపే అసెంబ్లీ సమావేశాలు కావని స్పష్టం చేశారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలా గెలచింది కేటీఆర్ ని తాను కాదని చెప్పారు. ప్రజల తీర్పు గౌరవించాలన్నారు. హిందూ ముస్లింపై తాను ఎప్పుడు మాట్లాడానని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకుండా ముస్లిం ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
కేటీఆర్ కుల అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ సెటిల్ మెంట్స్ కోసమే కులపిచ్చితో రిటైర్ అయిన ఆరుగురు అధికారులను తిరిగి పోస్టింగ్లు ఇచ్చారని ఆరోపించారు. నాస్తికుడైన కేటీఆర్ హిందువులను అంటే తాము పడాలా అని పేర్కొన్నారు. కేసీఆర్ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చేశారట.. కేటీఆర్ ఆ సర్టిఫికెట్ చూపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు.
మిషన్ కాకతీయ పథకం అమలు కోసం అధ్యయనం చేసిందే గుజరాత్ లోనని అలాంటిది ప్రపంచంలో ఎక్కడ లేని పథకం అంటూ నామా లోకసభలో అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. చిల్లరవాళ్ళతో చేరి నామా నాగేశ్వర్ రావు కూడా చిల్లర మాటలు మాట్లాడటం సరికాదని హితపు పలికారు. బీజేపీని బ్రిటిష్ పార్టీ అంటూ రేవంత్ మాట్లాడటం దారుణమని, అసలు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.