Pawan Kalyan Varahi Yatra: బయటికొచ్చి అభివాదాలు చేయొద్దు.. పవన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు .. జనసేన నేతలు ఏమన్నారంటే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించడం పట్ల జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Janasena Chief Pawan Kalyan
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) లో భాగంగా మూడవ విడత ఈరోజు నుంచి ప్రారంభంకానుంది. గురువారం నుంచి 19వ తేదీ వరకు వారాహి విజయయాత్ర కొనసాగనుంది. విశాఖపట్టణం (Visakhapatnam) లో వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి విమానంలో మధ్యాహ్నం సమయంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి తాను బసచేసే హోటల్ కు పవన్ చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు జగదాంబ జంక్షన్‌లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలవుతుంది. 5గంటల నుంచి 9గంటల వరకు వారాహి విజయయాత్ర సభ జరగనుంది. అయితే, పవన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు.
Pawan Kalyan Varahi Yatra : విశాఖ నుంచి పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర
మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని పోలీసులు కోరారు. విమానాశ్రయం నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని స్పష్టం చేశారు. పవన్ ఎక్కడా రోడ్ షో నిర్వహించొద్దని, బయటికొచ్చి అభివాదాలు కూడా చేయొద్దని పోలీసులు సూచించారు. వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5గంటలకు నగరంలోని జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎయిర్ పోర్టు ఆవరణలో ర్యాలీలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. మధ్యాహ్నం సమయంలో సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని పవన్ వెళ్లే రూట్ లో పోలీసులు మార్పులు చేశారు.
పవన్ విశాఖ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించడం పట్ల జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుకు నిర్ణయించినట్లు జనసేన నాయకులు ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్ తాటిచెట్ల పాలెం, న్యూ కాలనీ మీదుగా సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాము చెప్పిన రూట్లోనే వెళ్లాలని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. పోలీసులు తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్‌ను ఎవ్వరూ చూడకూడదని లూప్‌లైన్ రూట్లో పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.
గన్నవరం నుండి విశాఖ బయలుదేరిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు సాయంత్రం విశాఖ నగరం, జగదాంబ జంక్షన్ లో జరగనున్న వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పాల్గొననున్నారు.#VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP pic.twitter.com/Co5mJH0wJV— JanaSena Shatagni (@JSPShatagniTeam) August 10, 2023