చద్దామన్నా చావనీయదు : ఈ ఫ్యాన్ కు ఉరి వేసుకోలేం

 ఆత్మహత్య  చేసుకునే వారి పై ఫ్యాన్ కన్నెర్ర చేసింది. నీ ఆత్మహత్య బరువు నాకెందుకంటూ తప్పించుకుంటోంది. ఉరేసుకుని చనిపోవాలనుకునే వారికి హ్యండిస్తూ సరికొత్తగా జనాల ముందుకొస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 06:09 AM IST
చద్దామన్నా చావనీయదు : ఈ ఫ్యాన్ కు ఉరి వేసుకోలేం

 ఆత్మహత్య  చేసుకునే వారి పై ఫ్యాన్ కన్నెర్ర చేసింది. నీ ఆత్మహత్య బరువు నాకెందుకంటూ తప్పించుకుంటోంది. ఉరేసుకుని చనిపోవాలనుకునే వారికి హ్యండిస్తూ సరికొత్తగా జనాల ముందుకొస్తోంది.

ఆత్మహత్య.. ఆ ఆలోచన వచ్చిన వారికి మొదటగా గుర్తుకొచ్చేది ఉరివేసుకోవటం. అందుబాటులో ఉండేది ఫ్యాన్. పైకి వెళ్దాం అనుకున్న వారికి పైన కనిపించే యమపాశం ఈ ఫ్యాన్. ఈజీగా ఫ్యాన్ కు ఉరేసుకుని ఉసురు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆత్మహత్యలో 70శాతం ఫ్యాన్ కు ఉరి వేసుకుంటున్న ఘటనలే ఉన్నాయి. ఇలాంటి చావులను చూసిన ఓ వ్యక్తి కలత చెందాడు. ఫ్యాన్ కు ఉరి వేసుకోకుండా చేయాలంటే ఏం చేయాలనే ఆలోచన చేశాడు. అతను ఎవరో కాదు చిన్న కుర్రోడు. స్కూల్ చదువుతున్నాడు. పెద్దపెద్దోళ్లకే రాని ఆలోచనకు కార్యరూపం చేసిన స్టూడెంట్ వెంకటేష్. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటలోని నగండ్ల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.

వెంకటేష్ తీసుకొచ్చిన ఫ్యాన్ ఐడియా ఏంటీ?

సీలింగ్ కు ఫ్యాన్.. ఓ ఐరన్ రాడ్ ద్వారా బిగిస్తారు. దీని వల్ల ఎంత బరువును అయినా ఆపగలదు. వెంకటేష్ ఆవిష్కరించిన కొత్త విధానంలో.. సీలింగ్ – ఫ్యాన్ మధ్య ఓ స్పింగ్ ఉంటుంది. ఇది 25 కిలోల బరువు వరకు స్ట్రాంగ్ గా.. కదలకుండా ఉంటుంది. అంతకంటే ఎక్కువ బరువు ఫ్యాన్ పై పడితే.. కిందకు జారుతుంది. బరువు పెరిగే కొద్దీ.. ఫ్యాన్ నేలకు దిగుతుంది. దీనివల్ల ఫ్యాన్ కు ఉరి వేసుకున్నప్పుడు అది కింద జారి.. ఉరి సాధ్యం కాదు. అయితే ఈ విధానాన్ని ఫ్యాన్ ఏర్పాటు చేసే సమయంలోనే అమర్చాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు ఉరి సాధ్యం కాకపోవటం వల్ల ఆలోచనలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుందని.. ఉరి వేసుకోవాలనే ఆలోచన కూడా మారొచ్చని చెబుతున్నాడు వెంకటేష్. స్టూడెంట్స్ జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ లో దీన్ని ప్రదర్శించాడు. ఉపాధ్యాయులు, అధికారులు, సామాజిక కార్యకర్తల నుంచి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఫ్యాన్ల తయారీ కంపెనీలు కూడా ఈ విధానంలో తయారు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల ఫ్యాన్లకు ఉరి వేసుకుని చచ్చిపోయే వారి సంఖ్య తగ్గిపోవటంతోపాటు.. వారి ఆలోచనల్లోనూ మార్పు వస్తుంది అంటున్నారు సామాజిక వేత్తలు. ఎంతైనా వెంకటేష్ హ్యాట్సాప్ చెప్పాల్సిందే..