Yadagirigutta : యాదగిరి గుట్టలో కూలిన పాత భవనం-నలుగురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.

Old building collapse
Yadagirigutta : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
యాదగిరి గుట్టలోని మెయిన్ రోడ్డులో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్ ఎదురుకుండానే ఈ ఘటన జరిగింది. ఘటనా స్ధలానికి చేరుకున్నపోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బాల్కనీ కూలిన రెండంతస్తుల భవనం 35 ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. శిధిలాలు కింద పడుతున్నప్పుడు ఆ శబ్దానికి కొందరు తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Also Read : CM Jagan Reaction : రమ్య హత్య కేసు దోషికి ఉరిశిక్షపై సీఎం జగన్ ఏమన్నారంటే..