CM Jagan Reaction : రమ్య హత్య కేసు దోషికి ఉరిశిక్షపై సీఎం జగన్ ఏమన్నారంటే..

గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్షను విధించింది.(CM Jagan Reaction)

CM Jagan Reaction : రమ్య హత్య కేసు దోషికి ఉరిశిక్షపై సీఎం జగన్ ఏమన్నారంటే..

Cm Jagan Reaction (1)

CM Jagan Reaction : బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో వచ్చిన తీర్పును ఏపీ సీఎం జగన్ స్వాగతించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు జగన్. వేగంగా దర్యాఫ్తు పూర్తి చేసి దోషికి శిక్ష పడేలా చేసిన పోలీసులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.

”విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నా. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ వేగంగా దర్యాప్తు పూర్తి చేసింది. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

గత సంవత్సరం గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగిందన్న భావన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది.(CM Jagan Reaction)

దూరం పెట్టిందని దారుణ హత్య..
గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్షను విధించింది. గత ఏడాది ఆగస్ట్ 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి శశికృష్ణ హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా 24 గంటల్లోనే శశికృష్ణను పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

Guntur : బీటెక్ విద్యార్ధిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 36 మందిని విచారించిన పోలీసులు 15 రోజుల వ్యవధిలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని కూడా చూసిన న్యాయమూర్తి ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. శుక్రవారం తుది తీర్పును వెలువరించారు. శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. నిందితుడు శశికృష్ణ గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఉత్కంఠతో ఎదురు చూడగా.. కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే నేర నిర్ధారణ చేసిన ప్రత్యేక న్యాయమూర్తి.. శుక్రవారం మధ్యాహ్నం నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా రమ్యకు పరిచయమైన శశికృష్ణ.. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. అతని వేధింపులు భరించలేక రమ్య.. శశికృష్ణ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఇది జీర్ణించుకోలేని శశికృష్ణ కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. హత్య కేసులో కీలకమైన సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించిన న్యాయమూర్తి.. ఇరువర్గాల వాదనలు విని ఈ నెల 26న విచారణ పూర్తి చేశారు. 9 నెలల విచారణ చేసిన ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.(CM Jagan Reaction)

తమ కూతురికి జరిగిన ఘోరం ఎవ్వరికీ జరగకూడదని రమ్య తల్లిదండ్రులు అన్నారు. ఈ తీర్పుతో ఆమె ఆత్మకు శాంతి కలిగిందన్నారు. ప్రేమోన్మాదులకు ఇలాంటి శిక్షలు పడాలని, అప్పుడే నేరాలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వం, పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.