Omicron Variant: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా పరీక్షలు జరపండి – హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల రీత్యా ప్రభుత్వానికి హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. గురువారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది.

Omicron Variant: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా పరీక్షలు జరపండి – హైకోర్టు

High Court

Updated On : December 23, 2021 / 11:38 AM IST

Omicron Variant: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల రీత్యా ప్రభుత్వానికి హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. గురువారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రత్యేక ఆదేశాలిచ్చింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను జనం గుంపులుగా గుమిగూడకుండా జరుపుకోవాలని చెప్పింది.

ఎయిర్‌పోర్టుకు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి జరిపినట్లుగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా కరోనా పరీక్షలు జరపాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ దృష్టిలో ఉంచుకుని ఎటువంటి నిబంధనలు అమలు చేశారో.. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని చెప్పింది.

rEAD aLSO : చలికాలంలో అధిక రక్తపోటుతో జాగ్రత్త తప్పనిసరి!…