Blood Pressure : చలికాలంలో అధిక రక్తపోటుతో జాగ్రత్త తప్పనిసరి!…

రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను మానేయాలి. మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం మానేయాలి. రోజూ క‌చ్చితంగా వ్యాయామం చేయాలి.

Blood Pressure : చలికాలంలో అధిక రక్తపోటుతో జాగ్రత్త తప్పనిసరి!…

Bp

Blood Pressure : హైబీపీ…అధిక రక్తపోటు స‌మ‌స్య అనేది చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఒక వ‌య‌స్సు త‌రువాత బీపీ పెర‌గ‌డం అనేది స‌హ‌జంగానే చాలా మందిలో క‌నిపిస్తోంది. ఒత్తిడి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల యువ‌త‌లో కూడా హైబీపీ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే శీతాకాలంలో, ఉష్ణోగ్రత తగ్గుతుంది, దీని కారణంగా శరీరంలో రక్త ప్రసరణను అడ్డంకులు ఏర్పడుతుంటాయి. మన శరీరానికి కావలసినంత వేడి అందదు. దీని కారణంగా చలికాలంలో అధిక బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తీవ్రమైనదిగా మారుతుంది. ఇది రక్తపోటు స్థాయిని పెంచడమే కాకుండా, దానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా తరచుగా పెరుగుతాయి ఇత‌ర కాలాల‌లో కంటే చ‌లికాలంలోనే బీపీ ఎక్కువ‌య్యే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. బీపీ లేని వారితో పోలిస్తే హైబీపీ ఉన్న‌వారికి స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక బీపీ ఉన్న‌వారు చ‌లికాలంలో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారిలో విప‌రీత‌మైన అల‌స‌ట‌, తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొంద‌రికి మ‌తిమ‌రుపు స‌మ‌స్య వ‌స్తుంది. చెప్పిన విష‌యాల‌ను స‌రిగ్గా గుర్తు పెట్టుకోలేరు. అలాగే కొంద‌రికి ముక్కు నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. దీంతోపాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్ధితుల్లో తగిన జాగ్రతలు తీసుకోవటం మంచిది. ప్రతిరోజూ రక్తపోటు స్థాయిని తనిఖీ చేసుకోవాలి. సమస్యను వైద్యుడికి వివరించి, ఆయన సలహా ప్రకారం జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. కానీ, భారీ వ్యాయామాలు చేయకుండా ఉండండి. అదేవిధంగా నిపుణుడి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామాలు చేయాలి. ఎండలో, చల్లని గాలిలో ఎక్కువసేపు ఉండకపోవటమే మంచిది.

మార్కెట్‌లో అనేక ర‌కాల బీపీ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక మెషిన్‌ను కొనుగోలు చేసి రోజూ బీపీని చెక్ చేసుకోవాలి. దీనివ‌ల్ల బీపీ ఎంత ఉందో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ దాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చు. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను మానేయాలి. మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం మానేయాలి. రోజూ క‌చ్చితంగా వ్యాయామం చేయాలి. క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా స‌రే చేయాలి. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను మానేయాలి. మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం మానేయాలి. రోజూ క‌చ్చితంగా వ్యాయామం చేయాలి. క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా స‌రే చేయాలి. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే..అన్ని సమస్యలు దూరంగా ఉంటాయి. కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు అధిక బిపి రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉప్పును ఎప్పుడూ పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, చేపలు, గుడ్లు, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి.

చ‌ల్ల‌ని ప్ర‌దేశంలో ఎక్కువ సేపు ఉండ‌వ‌ద్దు. అలా అని చెప్పి ఎండ‌లోనూ మ‌రీ ఎక్కువ సేపు ఉండ‌వ‌ద్దు. శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎప్పుడూ ఒకే ర‌కంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా ఉంటుంది. బీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.కూర‌గాయలు, పండ్ల‌ను అధికంగా తీసుకోవాలి. వాటిల్లో ఉండే పొటాషియం బీపీని త‌గ్గిస్తుంది. అలాగే కొవ్వు తీసిన పాలు తాగాలి. ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, చేపలు, గుడ్లు, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఈ విధంగా జాగ్ర‌త్త‌లు పాటిస్తే బీపీ అదుపులోకి వ‌స్తుంది.

హైబీపీని త‌గ్గించ‌డంలో తుల‌సి ఆకులు బాగా ప‌నిచేస్తాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నాలుగైదు తుల‌సి ఆకుల‌ను కోసి నేరుగా అలాగే న‌మిలి మింగాలి. లేదా 1 టీస్పూన్ మోతాదులో తుల‌సి ఆకుల ర‌సం తాగాలి. దీంతో బీపీ త‌గ్గుతుంది.తుల‌సి ఆకుల్లాగే క‌రివేపాకులు కూడా బీపీకి బాగానే ప‌నిచేస్తాయి. వీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే 10 ఆకుల చొప్పున తింటుండాలి. హైబీపీ త‌గ్గుతుంది.వేపాకులు కూడా బీపీని త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వేపాకుల ర‌సం 1 టీస్పూన్ మోతాదులో ఉద‌యం ప‌ర‌గ‌డుపునే సేవించాలి. లేదా నాలుగైదు వేపాకులను అలాగే న‌మిలి మింగుతుంటే బీపీ అదుపులోకి వ‌స్తుంది.