హైదరాబాద్ లో LRS, అక్రమ లేవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 01:48 PM IST
హైదరాబాద్ లో LRS, అక్రమ లేవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట

unique id for plots

Updated On : September 1, 2020 / 3:02 PM IST

అక్రమ లేవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. మరోసారి హైదరాబాద్ లోప్రభుత్వం LRS ప్రకటించింది. 2020, సెప్టెంబర్ 01వ తేదీ మంగళవారం జీవో నెంబర్ 131ని విడుదల చేసింది.



కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్ లోని ప్లాట్ల అక్రమ నిర్మాణాలకు తెలంగాణ సర్కార్ రిజిస్ట్రేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సౌకర్యం కల్పించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్లైంది.
https://10tv.in/ap-government-reduces-coronavirus-confirmation-test-rates/
ఆగస్టు 26వ తేదీ వరకు కటాఫ్ డేట్ గా ప్రకటించింది.
టీఎస్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథార్టీ, మున్సపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలకు ఎల్ఆరఎస్ వర్తింపు.
అక్టోబర్ 15వ తేదీలోగా ఆన్ లైన్ లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నింపాలి.
ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1000, లే అవుట్ అప్లికేషన్ ఫీజు రూ. 10 వేలు.
రెగ్యులరైజేషన్ ఛార్జీలు 100 గజాలలోపు ప్లాట్లకు గజానికి రూ. 200.
100 నుంచి 300 గజాల వరకు రూ. 400 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.
300 నుంచి 500 వరకు గజానికి రూ. 600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.
530 గజాలున్న ప్లాట్లకు రూ. 700 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.



రాష్ట్రంలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం యోచించింది. దీంతో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఈసారి ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీనివల్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నా అది సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని చోట్ల కూల్చివేతలు చేపట్టినా..ముందుకు సాగలేదు.



కూల్చివేతలు ప్రక్రియ ప్రారంభిస్తే..పేదలు, మధ్యతరగతి వారే నష్టపోతారని ప్రభుత్వం భావించింది. వీటని క్రమబద్దీకరిస్తే..ప్రభుత్వానికి ఆదాయంతో పాటు యజమానులకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.