లక్ష బెడ్ రూంల వివాదం, భట్టి ఇంటికి మంత్రి తలసాని

  • Published By: madhu ,Published On : September 17, 2020 / 10:52 AM IST
లక్ష బెడ్ రూంల వివాదం, భట్టి ఇంటికి మంత్రి తలసాని

Updated On : September 17, 2020 / 11:22 AM IST

లక్ష బెడ్ రూం ఇళ్లు చూపెట్టండి..ఇంట్లోనే ఉంటా..రండి అంటూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు.



చూపిస్తా..అంటూ..గురువారం ఉదయం భట్టి ఇంటికి వెళ్లారు మంత్రి తలసాని. ఈ సమయంలో..మల్లు భట్టి గాంధీ భవన్ లో ఉన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నారు. తలసాని వస్తున్నారన్న విషయం తెలుసుకున్న భట్టి..ఇంటికి వెళ్లిపోయారు.
https://10tv.in/mothers-sacrifice-for-children-vikarabad-heavy-rain/
ఇంటికి వెళ్లిన మంత్రి తలసానికి వెల్ కం చెప్పారు మల్లు. మంత్రి తలసాని వెంట మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, ఇతర టీఆర్ఎస్ నేతలున్నారు. మల్లు వెంట విక్రమ్ గౌడ్, వీహెచ్ హనుమంతరావు తదితరులున్నారు.



ఈ సందర్భంగా 10tvతో మల్లు మాట్లాడారు. విక్రమ్ గౌడ్, వీహెచ్ ఉన్నారు. లక్ష ఇళ్లు రెడీ అయిపోయానంటున్నారు..చూపిస్తానని మంత్రి తలసాని వచ్చారని, చూస్తానని వ్యాఖ్యానించారు. మంత్రి ఎక్కడ చూపిస్తే..అక్కడ చూసిన తర్వాత..మీడియాతో మాట్లాడుతానని తెలిపారు. మంత్రి తలసాని కూడా మాట్లాడారు.

వారికి చూపించిన తర్వాతే..ఇతర వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. మంత్రి తలసాని, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు బయలుదేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.



డబుల్ బెడ్ రూం నిర్మాణాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ప్రచారం కోసం తప్ప..ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదని మల్లు..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. హైదరాబాద్ లో లక్షల దరఖాస్తులు వచ్చి ఉన్నాయని, కానీ..ఎక్కడ లేవన్నారు.



దీనికి మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. ఉదయం 10 గంటలకు మల్లు ఇంటికి వెళుతానని, ఎక్కడ నిర్మాణాలున్నాయో చూపిస్తానంటూ..చెప్పారు. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా..కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడం లేదని వ్యాఖ్యానించారు. నివాసాలు చూపించిన తర్వాత..కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.