36 గంటలుగా గాలించినా చిక్కని చిరుత జాడ 

  • Published By: venkaiahnaidu ,Published On : May 15, 2020 / 02:18 PM IST
36 గంటలుగా గాలించినా చిక్కని చిరుత జాడ 

Updated On : May 15, 2020 / 2:18 PM IST

ఆపరేషన్ చిరుత రెండో రోజు ముగిసింది. 36 గంటలుగా గాలించినా చిరుత జాడ చిక్కలేదు. చిరుత కోసం అటవీ శాఖ, పోలీస్ శాఖ, రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. చిరుత జనావాసాల్లో లేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిరుత హిమాయత్ సాగర్, గండిపేట మీదుగా వికారాబాద్ అడువుల్లోకి వెళ్లొచ్చని అనుమానిస్తున్నారు. చివరిగా రేపు కూడా ఆపరేషన్ కొనసాగిస్తామని అధికారులు ప్రకటించారు. 

ఆపరేషన్ చిరుతకు అధికారులు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. నిన్న ఉదయం నుంచి చిరుత జాడ కోసం చేస్తున్న ప్రయత్నాలకు రెండో రోజు కూడా చిరుత జాడ తెలియకపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ వేశారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్ సర్చ్ లో భాగంగా ఫామ్ లో హౌస్ లో నక్కిన చిరుత జాడ కనిపెట్టడం కోసం మూడు బృందాలు పోలీస్, అటవీశాఖ, రెస్క్యూ బృందాలు శత విధాలా ప్రయత్నం చేశాయి. ఫామ్ హౌస్ లో నక్కి ఉండొచ్చనే అనుమానంతో రాత్రంతా దానికి సంబంధించి రాత్రంతా గాలింపు చేపట్టారు. 

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ జాడ తెలియకపోవడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఉంటదని అంచనా వేశారు. ముఖ్యంగా చిరుత ట్రాక్ రికార్డు చూసినట్లైతే దానికి సంబంధించిన ట్రాక్ రికార్డు పరిగణనలోకి తీసుకున్నారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో 60 కిలో మీటర్ల వేగాన్ని అందుకున్న తర్వాత దాదాపు 50 నుంచి 60 కిలో మీటర్లకు వరకు నాన్ స్టాప్ గా పరుగెత్త గల కెపాసిటీ చిరుతకు ఉన్నట్లుగా విశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. 

బుద్వేల్ నుంచి చిరుత తప్పించుకుంది. గురువారం(మే 14, 2020) ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై స్థానికులు చిరుతపులిని గుర్తించారు. ఎన్‌హెచ్‌-7 ప్రధాన రహదారిపై గాయపడిన చిరుత కనిపించింది. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. వెంటనే అటవీశాఖ అధికారులు, జూ పార్క్‌ రెస్క్యూ టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. 

చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించగా అది తప్పించుకుంది. పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయింది. చిరుత ఎడమ కాలికి గాయమైంది. దీంతో అది వేగంగా పరిగెత్తలేకపోతోంది. గాయపడినా దొరక్కుండా అందరికి చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కరోనా మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు.. తాజాగా చిరుత భయం పట్టుకుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.