కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి నీతులు చెబుతావా.. దానం నాగేందర్‌పై కౌశిక్‌రెడ్డి ఫైర్

దానం నాగేందర్ స్థాయి మర్చి మాట్లాడుతున్నారు. 2018 జూన్ 22నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు చెప్పిన మాటలు గుర్తున్నాయా?

కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి నీతులు చెబుతావా.. దానం నాగేందర్‌పై కౌశిక్‌రెడ్డి ఫైర్

padi kaushik reddy takes on danam nagender over party defection

Updated On : July 14, 2024 / 12:59 PM IST

padi kaushik reddy on danam nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైరేంజ్‌లో ఫైర్ అయ్యారు. దానం నాగేందర్‌ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దయతో ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి నీతులు చెబుతున్నారంటూ మండిపడ్డారు.

”దానం నాగేందర్ స్థాయి మర్చి మాట్లాడుతున్నారు. స్థాయికి తగినట్టు మాట్లాడితే మంచిది. 2018 జూన్ 22నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు చెప్పిన మాటలు గుర్తున్నాయా? కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని చెప్పి, బీఆర్ఎస్‌లో చేరి కేసిఆర్ దయ వల్ల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. దానం నాగేందర్ నీకు సిగ్గు శరం లజ్జ ఉందా? బీడీలు అమ్ముకునే వ్యక్తి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు?

నీ ఇంటి చుట్టూ, హైదరాబాద్‌లో చేసిన కబ్జాలు అన్ని మాకు తెలుసు.. అవన్నీ బయటికి తీస్తాం. ఎంత మందిని వేధించావో.. వాళ్లంతా మా దగ్గరకు వస్తున్నారు. అమ్ముడు పోయిన నువ్వు నీతులు చెబుతున్నావా? పార్టీ మారిన నేతలందరూ రాజీనామా చేసి మళ్లీ గెలవాల”ని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు.

Also Read : తెలంగాణలో బలపడేందుకు టీడీపీ పక్కా వ్యూహం.. ఆ పార్టీలోకి నామా?

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆరే సీఎం
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. పార్టీని వీడివెళ్లే వారితో ఎటువంటి నష్టం లేదని, బీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని భరోసాయిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు.

Also Read : ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని భయపెడుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి?