Uttam Kumar Reddy: ఈటలవన్నీ పిచ్చి కామెంట్లు.. కేసీఆర్ పూర్తిగా ఫెయిల్ – ఉత్తమ్ కుమార్
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్ఎస్ పార్టీని వీడి వచ్చిన ఆయన కాంగ్రెస్ పై తప్పుడు కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు.

Uttam Kumar Reddy: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీఆర్ఎస్ పార్టీని వీడి వచ్చిన ఆయన కాంగ్రెస్ పై తప్పుడు కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ను టీఆర్ఎస్ కంట్రోల్ చేస్తోందన్న ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఇన్నాళ్ళు కేసీఆర్ వెంటే ఉన్న ఈటల ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మట్లాడుతున్నాడు.
అంతేకాకుండా సీఎం కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలోని కొవిడ్ సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోయారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం.. కరోనా ను అదుపు చేయడంలో విఫలమైంది. 15 నెలలు గడుస్తున్నా.. మెడికల్ ఇఫ్రాటెక్చర్ ను మెరుగు పరచలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా లెక్కలు, టెస్టుల సంఖ్య అన్ని తప్పుడు వివరాలే.
ఇటీవల కాలంలో ప్రైవేట్ హాస్పిటల్ లపై చర్యల పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ల విషయమై ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ తరపున ఫైట్ చేస్తున్నాం. ఇదే విషయమై జూన్ 7న గాంధీ భవన్ వేదికగా ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయనున్నాం.
వ్యాక్సినేషన్‌ను దేశ వ్యాప్తంగా అందరికీ ఇవ్వాలి. దేశంలో ప్రస్తుతం ఇస్తున్న 16 లక్షల డోస్ లను … కోటికి పెంచాలి’ అని అభిప్రాయపడ్డారు.