Peddapalli లో ఫైరింగ్, దుండగులను ఎదిరించిన TRS నేత

  • Published By: madhu ,Published On : September 30, 2020 / 09:54 AM IST
Peddapalli లో ఫైరింగ్, దుండగులను ఎదిరించిన TRS నేత

Updated On : September 30, 2020 / 10:24 AM IST

Peddapalli : పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం జరిగింది. స్థానిక లీడర్ దేవయ్య ఇంటికి 2020, సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తలుగురు దుండగులు వచ్చారు. వచ్చి రావడంతోనే రివాల్వర్ తో బెదిరింపులకు దిగారు.



గన్ తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హతాశులయ్యాడు దేవయ్య. వెంటనే తేరుకుని..వారిని ఎదిరించే ప్రయత్నం చేశాడు. పెనుగులాడి..ఒకరి వద్దనున్న రివాల్వర్ ను లాక్కొని విసిరేశాడు. పెనుగులాటలో అరుపులు, కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు.



ఓ భూ దందా వ్యవహారంలో బెదిరించేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.