PM Modi – Cm Chandrababu: చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ.. గంటపాటు సమావేశం.. ప్రధానంగా దానిపైనే చర్చ..!

తమ ఇంటికి వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్. ఈ సందర్భంగా చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

  • Published on- May 10, 2026 / 06:42 PM IST

PM Modi – Cm Chandrababu: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గంట పాటు వీరి భేటీ సాగింది. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాజకీయ అంశాలపైనా ఇరువురు డిస్కస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నివాసంలో అల్పాహారం తీసుకుని, టీ తాగారు ప్రధాని మోదీ. చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను ప్రత్యేకంగా పలకరించారు. చెస్ లో రాణిస్తున్న దేవాన్ష్ ను అభినందించారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపాడు దేవాన్ష్.

అంతకుముందు తమ ఇంటికి వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్. ఈ సందర్భంగా చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణలోనూ కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సందర్భంగాను తెలంగాణ రాజకీయాల గురించి మోదీ ప్రస్తావించినట్లు సమాచారం.

Also Read: మీరు కోరినట్లే చేస్తే తెలంగాణకు సగం నిధులే వస్తాయి, మీకు సరిపోతాయా?- సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ కౌంటర్