Pocso act case: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష

నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది.

Pocso act case: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష

Judgement

Pocso act case: నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. గతేడాది జరిగిన ఈ సంఘటనపై ఖమ్మం మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్‌(20) తన గ్రామంలో ఓ కిరాణా షాపును నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన షాపుకు చాక్లెట్ కొనుక్కోవడానికి వచ్చిన నాలుగేళ్ల మైనర్ అమ్మాయిపై పింగళి గణేశ్‌ అలియాస్‌ చింటూ అత్యాచారం చేశాడు.

2020 నవంబరు 19న ఈ ఘటన చోటుచేసుకోగా.. బాలిక ఏడుస్తూ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చింటూని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 2020లో జరిగిన ఈ సంఘటన పైన పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రతివాదనలు జరిగిన తర్వాత.. ఇప్పుడు నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది కోర్టు.

పోక్సో చట్టంలోని పలు సెక్షన్లు కింద అతనిపై కేసు నమోదవ్వగా.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 363( కిడ్నాప్), 376( అత్యాచారం) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు చేసిన నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు అవ్వగా.. పోక్సో చట్టాలు చాలా బలంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.