Maoists : భారీ విధ్వంసానికి మావోయిస్టుల కుట్ర..! భగ్నం చేసిన పోలీసులు
Maoists : 90 RDX బండిల్స్, 500 డిటోనేటర్లతో పాటు బొలెరో, ట్రాక్టర్, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు దళాలకు ఎవరైనా సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Maoists
Explosive Material : భారీ విధ్వంసానికి మావోయిస్టులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్‌కి తరలిస్తున్న భారీ ఆయుధాల డంప్‌ను పోలీసులు గుర్తించారు. భారీ కుట్రలో భాగంగా ఈ పేలుడు పదార్ధాలను మావోలకు చేరవేసేందుకు ప్రయత్నించిన 10మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడిన వారి నుంచి 90 RDX బండిల్స్, 500 డిటోనేటర్లతో పాటు బొలెరో, ట్రాక్టర్, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం సీపీ వినీత్ తెలిపారు. మావోయిస్టు దళాలకు ఎవరైనా సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ వినీత్ హెచ్చరించారు.