కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును జనగామ డీసీపీ సీతారాం తన సిబ్బందితో తనిఖీ చేశారు.

కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

జనగామ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. దేవరుప్పుల దారవత్ తండా పర్యటన ముగించుకుని సూర్యాపేట పర్యటనకు కేసీఆర్ వెళ్తున్నారు. కొడకండ్ల మండలం మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును జనగామ డీసీపీ సీతారాం తన సిబ్బందితో తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల తనిఖీలకు కేసీఆర్ సహకరించారు.

కాగా, మాజీ సీఎం కేసీఆర్ రైతు బాట చేపట్టారని బీఆర్ఎస్ నేతలు వివరించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలో లేకపోతే కాలువలో నీళ్లు లేవని, చెరువులు ఎండిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనం వల్ల కరవు వచ్చిందని తెలిపారు.

ప్రభుత్వం రైతు బంధు కూడా ఇవ్వట్లేదని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే మూడు నెలలు పాటు తాగునీటి ఎద్దడి తీర్చడానికి కృష్ణా నుంచి నీళ్ళు తీసుకోవాలని అన్నారు. అంధ్ర తాగు నీటి కోసం నీళ్ళు తీసుకుని పోతుందని చెప్పారు.

సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. రానున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ గెలుపునకు కార్యచరణ వేసుకున్నట్లు తెలిపారు. కేసీఆర్, కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేదని చెప్పారు.

లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత, పెన్షన్లు పంపిణీ విషయంలో ఈసీ ఆదేశాలపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు