లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత, పెన్షన్లు పంపిణీ విషయంలో ఈసీ ఆదేశాలపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

నేను 15ఏళ్లు మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గన్ మెన్ కూడా తీసుకోలేదు. లోకేశ్ నాకంటే పోటుగాడా? ఎందుకు అంత సెక్యూరిటీ..? అంటూ బొత్స ప్రశ్నించారు.

లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత, పెన్షన్లు పంపిణీ విషయంలో ఈసీ ఆదేశాలపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Botsa Satyanarayana

Botsa Satyanarayana : ఏపీలో వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలతో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రాజకీయ అభ్యంతరాలతో తీసుకునే నిర్ణయం వల్ల పెన్షన్ల పంపిణీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, ఇప్పటికిప్పుడు బ్యాంకు అకౌంట్లను సరిచేసుకొని నగదు బదిలీ చేయడం సంక్లిష్టమని బొత్స అన్నారు. టీడీపీ రాజకీయ అభ్యంతరాలతో డీఎస్సీ వాయిదా పడడం విచారకరమని, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామని బొత్స చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ అమలు చేస్తామని అన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు తన బ్రాండ్ ఒక్కటైన చూపిస్తారా అంటూ బొత్స ప్రశ్నించారు. వైసీపీ హయాంలో చేసిన మంచి పనులు ఎన్నైనా చెప్పగలుగుతాం. చేయని పనులు చెప్పుకుని శిలాఫలకాన్ని క్లెయిమ్ చేసుకునే నాయకుడు చంద్రబాబు అంటూ బొత్స విమర్శించారు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధి జరిగింది వైఎస్సార్ హయాంలో.. వైసీపీ ప్రభుత్వం అన్నింటిని కొనసాగించిందని బొత్స సత్యనారాయణ అన్నారు.

Also Read : అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితులు ఇలా ఉంటాయని తెలుసా? ప్రతిదానికి ఓ రేటు..

లోకేశ్ జడ్ ప్లస్ సెక్యూరిటీపై స్పందిస్తూ..
చంద్రబాబు, అతని కొడుకు ఎన్నికల కోసమే కూటమి తప్ప ప్రజలకోసం కాదని బొత్స విమర్శించారు. లోకేశ్ కు జెడ్ ప్లస్ కేటగిరికోసం జరుగుతున్న ప్రయత్నం.. కూటమి వెనుక జరుగుతుందేమిటో ప్రజలకు అర్థమైందన్నారు. నేను 15ఏళ్లు మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గన్ మెన్ కూడా తీసుకోలేదు. లోకేశ్ నాకంటే పోటుగాడా? ఎందుకు అంత సెక్యూరిటీ..? అంటూ బొత్స ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి గురవుతున్న తరుణంలో చంద్రబాబు కొడుక్కు సెక్యూరిటీ కోసమే కూటమి కట్టారంటూ విమర్శించారు. రావణాసురుడికి పది తలలు వున్నట్టుగానే చంద్రబాబుకు 10 నాలుకలు వున్నాయి. ఒక్కోసారి ఒక్కో నాలుక మడతబెట్టి మాట్లాడేస్తారు. వెయ్యి అబద్దాలు ఆడైన పెళ్లి చేయాలి అంటారు.. ఈ కూటమి కలయిక కూడా అటువంటిదే అంటూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిపై బొత్స విమర్శలు చేశారు.

Also Read : ఏపీలో వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు.. ఎన్నికల తర్వాతే డీఎస్సీ, టెట్

ఉత్తరాంధ్రతో వాళ్లకు ఏం సంబంధం..
టీడీపీ పోటీపెడుతున్న వలస అభ్యర్థులు ఉత్తరాంధ్రలో పోటీ చేయడానికి వాళ్లేమైనా జాతీయ నాయకులా అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. లాబీయిస్టులను తెచ్చి ఉత్తరాంధ్రపై రుద్దాలని చూడటం క్షమించరాని నేరం, కూటమి ఆలోచనలను ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకించాలని బొత్స పిలుపునిచ్చారు. ఒకరి మోచేతి కింద నీళ్ళు తాగాలనేది చంద్రబాబు ఆలోచన అయితే.. సొంత విధానాలతో వెళ్ళడం జగన్ అలవాటని బొత్స అన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉపసంహరించుకున్నట్టు కూటమి నేతలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పై తమ విధానం ప్రకటించే వరకు కూటమిని అడ్డుకోవాలని ప్రజలకు బొత్స పిలుపు నిచ్చారు.

పిఠాపురం మీటింగ్ లో ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అంటూ పవన్ కామెంట్స్ పై బొత్స స్పందిస్తూ.. పవన్ తన నిస్సహాయతను ఆయనే బయట పెట్టుకున్నారు. 24 సీట్లలో పోటీకూడా చేయలేక పోయాను అనే ఆవేదన పవన్ పరిస్థితికి నిదర్శనం అంటూ బొత్స అన్నారు.