మందు బాబులు జాగ్రత్త..! మత్తు వదిలిస్తున్న పోలీసులు

మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారా..? అయితే, మీ మత్తు వదిలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు అడపాదడపా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

మందు బాబులు జాగ్రత్త..! మత్తు వదిలిస్తున్న పోలీసులు

drunk and drive tests

Hyderabad Police : మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారా..? అయితే, మీ మత్తు వదిలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు అడపాదడపా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి జరిమానాలు విధిస్తూ వచ్చిన పోలీసులు.. ఇప్పుడు వారికి గట్టి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నగరంలో మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై కొరడా ఝళిపించనున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు మత్తు వదిలించారు.

Also Read : అమెరికాలో దారుణం.. తెలుగు యువకుడు దుర్మరణం

శనివారం రాత్రి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ఐటీ కారిడార్ లో 182 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 385 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 292 టూ వీలర్స్, 11 త్రీ వీలర్స్, 80 ఫోర్ వీలర్స్, రెండు హెవీ వెహికల్స్ ను పోలీసులు సీజ్ చేశారు.