పోలీసులకు యాక్సిడెంట్ అయితే కూడా పట్టించుకోని పోలీసులు.. మా పరిధిలోకి రాదని వదిలేయడంతో..
రోడ్డు ప్రమాదంపై పటాన్‌చెరు పోలీసులకు ఫొటోను పంపారు ఓఆర్ఆర్ సిబ్బంది.

హైదరాబాద్‌లోని పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు 3 వద్ద పోలీసు వాహనం బోల్తా పడింది. దీంతో పోలీస్ వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి.
టైరు బ్లాస్ట్ కావడంతో వాహనం బోల్తా పడింది. ఆ పోలీసు వాహనం సైబరాబాద్ కమిషనరేట్ కు చెందింది. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు.. మరి పడిడి ధరల సంగతేంటి?
పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ పై రోడ్డు ప్రమాద ఘటనపై అక్కడి మిగతా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. పోలీసులకు ప్రమాదం జరిగినా పట్టించుకోలేదు అక్కడి పోలీసులు. తమ పరిధి కాదన్న పేరుతో కాలయాపన చేశారు. రోడ్డు ప్రమాదంపై పటాన్‌చెరు పోలీసులకు ఫొటోను పంపారు ఓఆర్ఆర్ సిబ్బంది.
ఫొటో లొకేషన్ కోకాపేటని చూపటంతో తమ పరిధి కాదని పటాన్‌చెరు పోలీసులు వదిలేశారు. ప్రమాదం పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని చివరకు తెలుసుకున్నారు. చేసేది ఏమీలేక క్షతగాత్రులు ఔటర్ అంబులెన్స్ ఆసుపత్రికి తరలించింది.