మాజీ ఎంపీటీసీ మహేశ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
Former MPTC Mahesh: మృతుడు, నిందితుల నివాసాల వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ శివారులో దారుణ హత్యకు గురైన ఘట్‌కేసర్ మాజీ ఎంపీటీసీ మహేశ్ (40) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 17న మహేశ్ బయటకువెళ్లి తిరిగిరాకపోవంతో ఆయన సోదరుడు విఠల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్ మృతదేహం ఎన్‌ఎఫ్‌సీ నగర్ డంపింగ్ యార్డు లభ్యమైంది.
మృతుడి ఫోన్‌తోనే ఆయన బంధువులతో నిందితులు వాట్సాప్ చాటింగ్ చేశారు. దాంతో మహేశ్ ఎక్కడికీ పోలేదని నమ్మించే ప్రయత్నం చేశారు నిందితులు. మహేశ్ బతికే ఉన్నట్లు, హైదరాబాద్ లో పని ఉండి వచ్చినట్లు నమ్మించారు. తాను సొంత ప్రాంతానికి రావడానికి మరో మూడురోజులు పడుతుందని మృతిడి ఫోన్ తో నిందితులు వాట్సాప్ చాటింగ్ చేశారు.
చివరకు మహేశ్ మృతదేహం లభ్యమైంది. స్థానిక కౌన్సిలర్ మల్లేశ్‌పై మహేశ్ బంధువులు, తల్లి ఆరోపణలు చేశారు. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. మృతుడు, నిందితుల నివాసాల వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మహేశ్ హత్యపై చాలా అనుమానాలు ఉన్నాయని, సరైన విచారణ జరపాలని బంధువులు, కుటుంబ సభ్యులు అంటున్నారు.
Also Read: రీల్స్ పిచ్చితో సముద్రంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకులు.. వీడియో చూస్తారా?