రీల్స్ పిచ్చితో సముద్రంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకులు.. వీడియో చూస్తారా?

కచ్‌లోని భద్రేశ్వర్‌లో సముద్రం ఒడ్డున రెండు మహీంద్రా థార్ వాహనాలతో స్టంట్లు చేయడానికి..

రీల్స్ పిచ్చితో సముద్రంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకులు.. వీడియో చూస్తారా?

పర్యాటక ప్రాంతాలు చూడడానికి వెళ్తున్న యువకులు సరదాగా ఆయా ప్రాంతాల్లో గడిపి వచ్చేయక.. రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటనే మరొకటి గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కచ్‌లోని భద్రేశ్వర్‌లో సముద్రం ఒడ్డున రెండు మహీంద్రా థార్ వాహనాలతో స్టంట్లు చేయడానికి ప్రయత్నించిన యువకులు ఆ కడలిలోనే చిక్కుకుపోయారు. తెలుపు రంగులో ఉన్న మహీంద్రా థార్ వాహనాన్ని సముద్రపు ఒడ్డువైపుగా, ఎరుపు రంగులో ఉన్న వాహనాన్ని సముద్రం వైపుగా నీళ్లలో ఉంచారు.

వాహనాలను ముందుకు వెనక్కు నడుపుతూ స్టంటల్ చేద్దామనుకున్నారు. అయితే, అలల ధాటికి ఆ రెండు వాహనాలు సముద్రంలోనే చిక్కుకుపోయాయి. ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక అవస్థలు పడ్డారు. సముద్రపు అలల ఉద్ధృతి మరింత ఎక్కువైతే కడలిలో కొట్టుకుపోయేవారు.

చివరకు ఆ వాహనాలను స్థానికులు ఒడ్డుకు లాక్కువచ్చారు. ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్, సెల్ఫీలు తీసుకోవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చాలా మంది వినడం లేదు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబ సభ్యుల్లో విషాదం నింపుతున్నారు.

Also Read: ఈ విద్యార్థి గుండె గూటిలో ఎవరెవరు ఉన్నారో చూడండి..