IBomma Ravi Remand Report: ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. ఈ రెండే పట్టించాయి..
వాటిని అమెరికాలో ఒకటి, అమీర్ పేట్ లో మరొకటి రిజిస్ట్రర్ చేయించినట్లు గుర్తించారు.
IBomma Ravi Remand Report: ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పైరసీ నేరాన్ని నిందితుడు ఇమంది రవి అంగీకరించినట్లు తెలిపారు. పైరసీ వెబ్ సైట్స్ ఎలా నడిపాడో కూడా చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఐబొమ్మ, బప్పం పేరు మీదు రవి మొత్తం 17 వెబ్ సైట్లు నడిపాడని, ఐబొమ్మ- బెట్టింగ్ సైట్స్ మధ్య రెండు ట్రాఫిక్ డొమైన్స్ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని అమెరికాలో ఒకటి, అమీర్ పేట్ లో మరొకటి రిజిస్ట్రర్ చేయించినట్లు గుర్తించారు. ఈ రెండు డొమైన్లే రవిని పట్టించాయి. రవిని అరెస్ట్ చేయకపోతే ఇలాంటి వెబ్ సైట్లు మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.
రవి బెదిరింపులకు పాల్పడినట్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విదేశీ పౌరసత్వం తీసుకున్నాడు అంటేనే అతడి క్రిమినల్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరం అంటున్నారు. బెదిరింపులు, విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఐబొమ్మ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. మనీలాండరింగ్ ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు లేఖ రాసింది ఈడీ. రవి బ్యాంక్ అకౌంట్ లో దాదాపు 3.5 కోట్ల రూపాయలను పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. విదేశీ బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో రవి అకౌంట్ కు నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. నెలకు దాదాపు 15 లక్షలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది.
Also Read: టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..! షాక్‌లో అభిమానులు.. పోలీసుల అదుపులో బాయ్ ఫ్రెండ్..
