మీర్‌పేట్ మాధవి కేసులో బిగ్ అప్‌డేట్.. డీఎన్ఏ శాంపిల్స్ రెడీ..! కొన్ని గంటల్లో..
క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Gurumurthy, Venkata Madhavi
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో రెండు రోజుల క్రితం గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను చంపేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి, ఉడికించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వెంకటమాధవిని గురుమూర్తి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు.
ఎఫ్‌ఎస్‌ఎల్‌కు శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను పంపారు. డీఎన్‌ఏ మ్యాచింగ్ కోసం ఆధారాలు ఇచ్చారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ శాంపిల్స్ సేకరించింది. కొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్‌ఏ చేరనుంది. డీఎన్‌ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, జనవరి 15న జిల్లెలగూడలోని తన ఇంట్లో భార్య మాధవిని గురుమూర్తి హత్య చేసిన విషయం విదితమే. భవనంలో ఎవరూలేని సమయంలో దారుణానికి ఈ హత్య చేశాడు. తన భార్యను చంపిన తర్వాత ఆమె ఆనవాళ్లు లేకుండా చేయాలని గురుమూర్తి ఈ విధంగా ప్రవర్తించాడు.
ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించడమే కాకుండా, ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. ఆ తర్వాత వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు. గురుమూర్తి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామాపై బీజేపీ మౌనం వెనుక..?