Inter English Practicals : ఇంటర్ పరీక్షల విధానంలో కీలక మార్పులు.. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్!

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేశారు. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.

Inter English Practicals : ఇంటర్ పరీక్షల విధానంలో కీలక మార్పులు.. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్!

English Practicals

Updated On : December 11, 2022 / 12:14 PM IST

Inter English Practicals : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేశారు. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. దీంతో థియరీ మార్కులు తగ్గనున్నాయి. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ఇంగ్లిష్ లో ప్రాక్టికల్స్ అమలుపై నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఇంగ్లిష్ లో థియరీకి 80, ప్రాక్టికల్స్ కు 20 మార్కులు కేటాయించనున్నారు. వార్షిక పరీక్షలే కాకుండా ఇంటర్నర్ పరీక్షలను కూడా ఇదే విధానంలో నిర్వహించనున్నారు. నూతన విధానం ప్రకారం ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టుకు ల్యాబ్ వర్క్ తప్పనిసరి కానుంది. దీంతో అన్ని కాలేజీల్లో ఇంగ్లిష్ ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నారు.

Chhattisgarh Class 12 Board Exams : ఇంటి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకోవచ్చు..వినూత్న ఆలోచనకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం శ్రీకారం

వీటిలో విద్యార్థులు ఇంగ్లిష్ లో మాట్లాడటం, కంప్యూటర్ సహకారంతో ఆడియో రికార్డు చేయడం వంటి వాటిని నేర్పిస్తారు. థియరీ క్లాసులతోపాటు ల్యాబ్ వర్క్ కోసం కాలేజీలు షెడ్యూల్ లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ విధానం ఇంజినీరింగ్ కాలేజీల్లో అమల్లో ఉంది.
విద్యార్థులు పరీక్షలు ఎలా నిర్వహిస్తే వాటికే అలవాటు పడుతున్నారని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు థియరీ పరీక్షలు మాత్రమే రాసి, పాస్ అవుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ అవసరాల నేపథ్యంలో ఇంగ్లిష్ లో ధారాళంగా మాట్లాడటం తప్పనిసరి కావడంతో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.