Tragedy In Adilabad : ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక..చేతులపై తీసుకెళ్తుండగా గర్భిణీ మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ మృతి చెందింది. వాగులో నీరు ఎక్కువగా ఉండటంతో 108 వాహనం ఆస్పత్రికి వెళ్లలేకపోయింది.

Tragedy In Adilabad : ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక..చేతులపై తీసుకెళ్తుండగా గర్భిణీ మృతి

Adilabad

Updated On : August 23, 2021 / 8:06 AM IST

Pregnant woman died : ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ మృతి చెందింది. వాగులో నీరు ఎక్కువగా ఉండటంతో గాదిగూడ మండలంలోని కొలంగూడకు 108 వాహనం వెళ్లలేకపోయింది. దీంతో తొమ్మిది నెలల గర్భణి రాజుబాయిని కుటుంబ సభ్యులు చేతులపై మోసుకెళ్లి వాగు అవతల ఉన్న అంబులెన్స్‌లో ఎక్కించారు.

పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌ సిబ్బంది ఆమెను ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు రాజుబాయిని ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే రాజుబాయి కన్నుమూసింది.

పరస్ వాడ కు చెందిన కొడప రాజుబాయి ప్రసూతి కోసం కొలాంగూడలోని తన తల్లి గారి ఇంటికి వచ్చింది. అక్కడ సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సమాయానికి ఆస్పత్రికి చేరక నిండు ప్రాణం బలైపోయింది. రాజుబాయి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా వాగుపై బ్రిడ్జి నిర్మించి..రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందరి ప్రాణాలు పోవాలంటూ ఆవేదన చెందుతున్నారు.