PM Narendra Modi : తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు.. తెలుగులో ట్వీట్ చేస్తూ కీలక సూచనలు..

ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలుగులో ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు.

PM Narendra Modi : తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు.. తెలుగులో ట్వీట్ చేస్తూ కీలక సూచనలు..

PM Modi

Updated On : November 30, 2023 / 10:09 AM IST

PM Narendra Modi : తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలుగులో ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు. రికార్డు స్థాయిలో ఓట్లు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని సూచించారు. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

”తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను” మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభంమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.