ప్రధాని హైదరాబాద్ పర్యటన ఫిక్స్, షెడ్యూల్

prime ministers hyderabad tour : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 28న శనివారం హైదరాబాద్ రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో తయారవుతున్న తొలి భారతీయ కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌ను ఆయన పరిశీలించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరి.. మూడు గంటల 45 నిమిషాలకు హంకీంపేట్ చేరుకోనున్నారు. మూడు గంటల 50 నిమిషాలకు హకీంపేట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారత్ బయోటిక్ కంపెనీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా మళ్లీ హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
https://10tv.in/ghmc-election-kcr-key-statements-in-lb-stadium/
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో టీకా పంపిణీపై కసరత్తు చేస్తున్న ప్రధాని అంతకుముందు పూణేలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రధాని పుణే విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మద్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్-19 వ్యాక్సీన్ తయారీ, పంపిణీకి సంబంధించిన యంత్రాంగాన్ని సమీక్షించనున్నారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పూణె, హైదరాబాద్‌లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వంలో బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ మధ్య మాటల మంటల నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్ రాక ప్రాధన్యతను సంతరించుకుంది. మోదీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకున్నా.. ఆయన హైదరాబాద్ రావడం పార్టీ వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తోంది.