ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో కేశవరావు ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

కాంగ్రెస్‌కు వెళ్తే సొంత గూటికి వెళ్లినట్టుగా ఉంటుందని సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో కేశవరావు ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

Updated On : March 29, 2024 / 2:15 PM IST

Kesavarao Exlcusive Interview : కాంగ్రెస్‌కు వెళ్తే సొంత గూటికి వెళ్లినట్టుగా ఉంటుందని సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం కష్టాల్లో ఉందని, ఆ పార్టీకి తన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను చేయగలిగినంత చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 10టీవీలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.

కుటుంబ పాలన కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని కేశవరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సోషల్ ఇంజినీరింగ్ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీలోని ప్రతిభావంతులను సమర్థవంతంగా వినియోగించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ మంచి క్యాడర్ ఉంది.. కానీ సరిగా వాడుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ మారాలి.. కొత్త తరం రావాలని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ చేసినంత డెవ‌ల‌ప్‌మెంట్‌ దేశంలో ఎవరూ చేయలేదని, కానీ ఆయన పార్టీ నుంచి దూరమయిపోయాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిపరుడు కాదని పునరుద్ఘాటించారు. అధికార, ప్రతిపక్ష పార్టీ అగ్రనాయకులు వాడుతున్న భాష బాలేదని కుండబద్దలు కొట్టారు.