Cases On Celebs : సెలబ్రిటీలకు షాక్.. ఆ 11 మందిపై కేసులు నమోదు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసుల కొరడా..
విష్ణుప్రియ, సుప్రిత, రీతూచౌదరితో పాటు హర్షసాయి, టేస్టింగ్ తేజ, ఇమ్రాన్ పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

Cases On Celebs : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై కొరడా ఝళిపించారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11మంది సెలబ్రిటీలపైన కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కు మద్దతు తెలిపిన విష్ణుప్రియ, సుప్రిత, రీతూచౌదరితో పాటు హర్షసాయి, టేస్టింగ్ తేజ, ఇమ్రాన్ పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.
దాంతో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, టేస్టింగ్ తేజతో సహా 11మందిపై కేసు ఫైల్ చేశారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా ప్రభావితం చేస్తున్నట్లు ఈ కేసులో పొందుపరించారు. ఎఫ్ఐఆర్ లోనూ కీలక అంశాలను ప్రస్తావించారు.
Also Read : స్కూల్ అమ్మాయిలే టార్గెట్.. ట్రాప్ చేసి, డ్రగ్స్ అలవాటు చేసి అఘాయిత్యాలు- వరంగల్ కిలాడీ లేడీ కేసులో సంచలనం
కాగా, తాము కావాలని యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, పొరపాటు జరిగిందని కొందరు సెలబ్రిటీలు క్షమాపణ కూడా చెప్పారు. సారీ చెబుతూ రీతూ చౌదరి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే పోలీసులు షాక్ ఇచ్చారు. 11 మంది సెలబ్రిటీలపై యాక్షన్ తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు.
బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా ఈజీగా, భారీగా డబ్బులు సంపాదించొచ్చని కొందరు యూట్యూబర్లు ప్రమోషన్లు చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి యువత పెడదోవ పడుతోంది. బెట్టింగ్స్ యాప్స్ కారణంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అప్పులపాలైపోతున్నారు. డబ్బులు కట్టే పరిస్థితి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది యువకులు ఇలా బెట్టింగ్ యాప్ లకు బలైపోయారు.