Puvvada Ajay Kumar : నేను ఉన్నప్పుడు ఖమ్మం వస్తే అసలు సినిమా ఏంటో చూపిస్తా : తుమ్మలపై పువ్వాడ ఫైర్
తాను ఖమ్మంలో లేనప్పుడు బందిపోటు దొంగల్లా వచ్చి, ముగ్గురు కార్పొరేటర్లను లాక్కొని అదేదో ఘనత సాధించినట్టు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Puvvada Ajay Kumar (1)
Puvvada Ajay Kumar – Thummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. తన చేతిలో ఓడిపోయి, ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారుతున్నాడని అని విమర్శించారు. ఇంట్లో కూర్చున్న వ్యక్తిని పిలిచి ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అనేక పదవులు కట్టబెట్టినా ఇప్పుడు పార్టీని, కేసీఆర్ ని మోసం చేశారని మండిపడ్డారు.
Also Read: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు దిమ్మ తిరిగింది : మంత్రి తలసాని
ఈ మేరకు సోమవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018లో పొంగులేటి, తుమ్మలను కత్తులు దూసుకుని తొమ్మిది స్థానాలను ఓడించారని తెలిపారు. తాను ఖమ్మంలో లేనప్పుడు బందిపోటు దొంగల్లా వచ్చి, ముగ్గురు కార్పొరేటర్లను లాక్కొని అదేదో ఘనత సాధించినట్టు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘మీకు దమ్ముంటే నేను లేనప్పుడు రావటం కాదు.. ఉన్నప్పుడు వస్తే అసలు సినిమా ఏంటో నేను చూపిస్తా’ అని సవాల్ చేశారు. గుంట నక్కలా వ్యవహరించే వారికి తగిన బుద్ది చెబుతామని మంత్రి పువ్వాడ హెచ్చరించారు.