అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు : పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలి

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 12:17 PM IST
అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు : పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలి

Updated On : November 25, 2020 / 12:38 PM IST

PV, NTR graves should be demolished : గ్రేటర్ ఎన్నికల వార్ లో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇతర ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాము తలుచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.



https://10tv.in/ghmc-elections-2020-no-cell-phone-at-polling-stations-sec/
తాజాగా…MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కూల్చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అలా అయితే…హుస్సేన్ సాగర్ కట్టపై నున్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 4 వేల 700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్ ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీపై కూడా పలు విమర్శలు సంధించారు.



పేదలకు డబుల్ బెడ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామని మాయమాటలు చెబుతోందన్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో తమకు బాగా తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచకపడ్డారు. గడిచిన కొద్ది రోజులుగా..ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంఐంఎం చేస్తున్న విమర్శలను టీఆర్ఎస్ తిప్పికొడుతోంది.