Laxma Reddy : రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నా ఉసురు తగులుతుంది : రాగిడి లక్ష్మారెడ్డి

రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోతే ఇక్కడికి ఆహ్వానించి మల్కాజ్ గిరి ఎంపీగా గెలిపించుకున్నామని తెలిపారు. ఇప్పుడు తమను మర్చిపోయారని వెల్లడించారు.

Laxma Reddy : రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నా ఉసురు తగులుతుంది : రాగిడి లక్ష్మారెడ్డి

Ragidi Laxma Reddy

Updated On : October 15, 2023 / 1:51 PM IST

Laxma Reddy- Revanth Reddy : కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై రాగిడి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తన ఉసురు తగులుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగదని విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితే ఉందని తెలిపారు.

ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా గతంలో తన సీటు పోయినా పని చేశానని పేర్కొన్నారు. ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్న సమయంలో ఇక్కడ పార్టీకి జీవం పోశానని చెప్పారు.

Telangana Congress : టికెట్ పోటీ ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్.. సిరిసిల్లలో కేటీఆర్ కు ప్రత్యర్థిగా అభ్యర్థిని ప్రకటించని అధిష్టానం

అంతేకాకుండా రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోతే ఇక్కడికి ఆహ్వానించి మల్కాజ్ గిరి ఎంపీగా గెలిపించుకున్నామని తెలిపారు. ఇప్పుడు తమను మర్చిపోయారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి తనకు వత్తాసు పలికే వారికే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.