తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఇవాళ ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు..
తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Heavy Rain
Rain Alert: తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇవాళ (సోమవారం) ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రేపు (మంగళవారం) పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.