గుడ్‌న్యూస్.. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
Rains: పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Weather
అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు ఇవాళ గంటకు 30 నుంచి 40 కి.మీ, రేపు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయని తెలిపింది. ఇవాఅళ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
కాగా, కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వేడిగాలులకు వృద్ధులు, చిన్నారులు తట్టుకోలేకపోతున్నారు. ఎండలు అధికంగా ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.