Hyderabad Metro : ఛార్జీలు పెంచకుండానే హైదరాబాద్ మెట్రో షాక్.. టికెట్‌పై రాయితీలు, హాలిడే కార్డు రద్దు
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరాలంటే ఉన్న మార్గాల్లో మెట్రోరైలు ఒకటి

Hyderabad Metro Cancelled Concession Tickets
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరాలంటే ఉన్న మార్గాల్లో మెట్రోరైలు ఒకటి. ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా ఎండలు మండిపోతుండడంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు షాకిచ్చారు.
ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులపై కొంత భారం వేశారు. సూపర్ సేవర్ హాలీడే కార్డ్(రూ.59)ను పూర్తిగా రద్దు చేశారు. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని తెలిపారు. ఈ కార్డుతో రూ.59 చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఈ సౌలభ్యం అందుబాటులో ఉండేది.
అలాగే.. మెట్రోకార్డుపై ఇస్తున్న 10శాతం రాయితీని పూర్తిగా ఎత్తివేశారు. కాగా.. గతేడాది ఏప్రిల్‌లో రద్దీ వేళల్లో మెట్రోకార్డు పై ఇస్తున్న రాయితీని ఎత్తివేయగా.. ఇప్పుడు పూర్తిగా తొలగించారు. రాయితీలను రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికలవేళ నగదు, బంగారం తీసుకెళ్తున్నారా..? సీఈవో వికాస్ రాజ్ ఏం చెప్పారంటే